శాయిన్‌పేట చెరువు నీళ్లు, కేఎల్‌ఐ కాల్వ నీళ్లు పోవడానికి పురాతన కాలం నుంచి ఫిడెల్ కాల్వ ద్వారా నీళ్లు వెళ్తున్నాయి. ఈ మధ్యకాలంలో కొందరు వ్యక్తులు ఫిడెల్ కాల్వను పూడ్చివేయడంతో చెరువు, కేఎల్‌ఐ కాల్వ నీరు మా పొలాల్లోకి వచ్చి పూర్తిగా కోతకు గురై వ్యవసాయం చేసుకోవడానికి పనికిరాకుండా మారుతున్నాయి. అధికారులు స్పందించి ఫిడెల్ కాల్వను పునరుద్ధరించి.. కాల్వను పూడ్చిన వ్యక్తులపై చర్యలు తీసుకోవాలి.
– తిరుపతయ్య, బాబు, మల్లయ్య,
అంబట్‌పల్లి గ్రామం, లింగాల మండలం


