నేడు డయల్‌ యువర్‌ డీఎం | - | Sakshi
Sakshi News home page

నేడు డయల్‌ యువర్‌ డీఎం

Jul 21 2026 1:42 AM | Updated on Jul 21 2026 1:42 AM

అచ్చంపేట రూరల్‌: ప్రయాణికుల సౌకర్యార్థం అన్ని రూట్లలో ఆర్టీసీ బస్సులను నడిపిస్తున్నామని, ప్రయాణికులు, ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని అచ్చంపేట ఆర్టీసీ డీఎం శ్రీనివాస్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డిపో కార్యాలయంలో డయల్‌ యువర్‌ డీఎం కార్యక్రమం ఉంటుందన్నారు. ప్రయాణికులు, ఉద్యోగులు, వ్యాపారులు తమ సందేహాలు, సూచనలను సెల్‌ నం.99592 26291కు కాల్‌ చేయాలని కోరారు.

అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు

అమ్రాబాద్‌: అమ్రాబాద్‌ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఖాళీగా ఉన్న అతిథి అధ్యాపక పోస్టులకు మంగళవారం దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ గోపాల్‌ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్‌ 2, ఇంగ్లిష్‌ 1, హిస్టరీ 1, ఎకనామిక్స్‌ 1, పొలిటికల్‌ సైన్స్‌ 1, జువాలజీ 1, కంప్యూటర్‌ సైన్స్‌ 1, తెలుగు 1, బాటనీ ఒక పోస్టు ఖాళీగా ఉన్నాయన్నారు. ఆయా సబ్జెక్ట్‌లలో పీజీలో 55 శాతం, (ఎస్సీ, ఎస్టీలకు 50శాతం) ఉన్నవారు అర్హులని, సెట్‌, నెట్‌, స్లేట్‌, పీహెచ్‌డి ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. ఆసక్తి గలవారు మంగళవారం సాయంత్రం వరకు ధ్రువపత్రాలను కళాశాలలో అందజేయాలని సూచించారు.

డిగ్రీ కళాశాలలో..

బల్మూర్‌: మండలంలోని కొండనాగుల ఉమామహేశ్వరి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో 9 అతిథి అధ్యాపక పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపల్‌ రవి ఒక ప్రకటనలో తెలిపారు. కామర్స్‌ 2, తెలుగు, ఇంగ్లిష్‌, బీఎఫ్‌ఎస్‌ఐ, కంప్యూటర్‌ సైన్స్‌– అప్లికేషన్స్‌, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్‌, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్‌ సబ్జెక్టులకు ఒక్కొక్క పోస్టు చొప్పున మొత్తం 9 పోస్టులు ఉన్నాయని, అర్హత గల అభ్యర్థులు తమ దరఖాస్తులను బుధవారం కళాశాలలో సమర్పించాలని సూచించారు. దరఖాస్తు చేసుకున్న వారికి గు రువారం ఉదయం 10.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల నాగర్‌కర్నూల్‌లో ఉంటాయని, అభ్యర్థులు తమ అసలు విద్యార్హత ధ్రువపత్రాలతో హాజరుకావాలని సూచించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement