వినాయక నిమజ్జనంలో సితార, గౌతమ్.. వీడియో వైరల్!! | Vinayaka Visarjan 2023 Celebrations In Actor Mahesh Babu Home, Gautham And Sitara Video Goes Viral - Sakshi
Sakshi News home page

Mahesh Babu Home Ganpati Visarjan: వినాయకుడికి వీడ్కోలు చెప్పిన సితార, గౌతమ్!!

Sep 22 2023 12:13 PM | Updated on Sep 22 2023 12:38 PM

Vinayaka Visarjan Celebrations In Heor Mahesh Babu Home - Sakshi

సూపర్ స్టార్ మహేశ్‌ బాబు ఇంట్లో గణేశ్ నిమజ్జన వేడుకలు నిర్వహించారు. టాలీవుడ్ ప్రిన్స్ కూతురు సితార, కుమారుడు గౌతమ్ గణనాథునికి ఘనంగా వీడ్కోలు పలికారు. హైదరాబాద్‌లోని ఇంటిలో జరిగిన ఈ వేడుకకు సంబంధించిన వీడియోను  నమ్రతా శిరోద్కర్ తన ఇన్‌స్టాలో షేర్ చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

(ఇది చదవండి: తొలిసారి హీరోయిన్‌గా ట్రాన్స్‌జెండర్‌.. హీరోగా ఎవరంటే?)

తమ ఇంట్లో పూజలు చేసిన వినాయకుడిని ఆవరణలోని ఓ డ్రమ్ము నీటిలో నిమజ్జనం చేశారు. ఈ వీడియోలో నమ్రతా, మహేశ్ బాబు ఎక్కడా కూడా కనిపించలేదు. ఇంట్లోని పనివారితో కలిసి ఈ వేడుకల్లో సితార, గౌతమ్ పాల్గొన్నారు. నమ్రతా ఇన్‌స్టాలో రాస్తూ 'గణపతి బప్పా  మోరియా.. వచ్చే ఏడాది మళ్లీ కలుద్దాం' అంటూ పోస్ట్ చేసింది. అయితే మహేశ్ బాబు కూతురు సోషల్ మీడియాలో ఎప్పుడు యాక్టివ్‌గానే ఉంటూ అభిమానులతో టచ్‌లోనే ఉంటోంది. 

కాగా.. మహేష్ బాబు ప్రస్తుతం  త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న గుంటూరు కారం మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీ వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి నటిస్తున్నారు. ఈ సినిమా తర్వాత మహేష్.. రాజమౌళితో కలిసి ఓ భారీ బడ్జెట్ చిత్రం చేయనున్నారు. 

(ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)


Advertisement
 
Advertisement
Advertisement