హీరోయిన్‌గా ట్రాన్స్‌జెండర్‌.. ఏ సినిమానో తెలుసా?

Transgender VAISHALI DESAI Acts In Sandalwood Movie Mr and Mrs Manmatha - Sakshi

ఏ సినీ పరిశ్రమ అయినా సరే ఎప్పుడు కొత్తదనం ఉండాల్సిందే. అది కంటెంట్ అయినా.. నటీనటులైనా సరే. కాన్సెప్ట్ కొత్తగా ఉంటేనే ప్రేక్షకులు ఆసక్తి చూపిస్తారు. అంతే కాకుండా కొత్తవారితో ప్రయోగాలు కొత్త ప్రయత్నాలతో కొత్త కాన్సెప్ట్ సినిమాలు ప్రేక్షకులను ఆకట్టుకున్న ఉదాహరణలు చాలానే ఉన్నాయి. ఏ ఇండస్ట్రీలో సినిమా హిట్, ఫ్లాప్ అనే తేడా లేకుండా కొత్తదనాన్ని అందిపుచ్చుకుంటూ వస్తున్నారు. ఇటీవల హీరో, హీరోయిన్ల విషయంలో కొత్తవారితోనే సినిమాలు తెరకెక్కిస్తున్నారు. ఈసారి కన్నడ సినిమా చరిత్రలో ఎన్నడూ లేని విధంగా సరికొత్త, ఆశ్చర్యకరమైన పరిణామం చోటుచేసుకుంది. తొలిసారిగా ఓ సినిమాలో ట్రాన్స్‌జెండర్ హీరోయిన్‌గా సినిమాను తెరకెక్కిస్తున్నారు.

(ఇది చదవండి: అక్కడేమో క్రేజ్ లేదు.. ఇక్కడ చూస్తే ఫ్లాప్.. మిగిలింది ఆ సినిమా ఒక్కటే!)

హీరోయిన్‌గా అవకాశం

అయితే ప్రస్తుతం శాండల్‌వుడ్‌లో తెరకెక్కుతోన్న చిత్రం మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ. ఈ సినిమా కోసం ఏకంగా ఆరుగురు హీరోయిన్లకు ఎంపిక చేశారు. వారిలో ట్రాన్స్‌జెండర్‌ వైశాలి కూడా ఒకరు. దీంతో తొలిసారిగా ఓ హీరోయిన్‌గా నటించే అరుదైన అవకాశం దక్కించుకుంది వైశాలి. ఇటీవలే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ ట్రైలర్ లాంఛ్ కార్యక్రమం నిర్వహించారు. ఈవెంట్‌కు హాజరైన వైశాలి ఆసక్తికర కామెంట్స్ చేసింది. 


 

వైశాలి మాట్లాడుతూ..'మేం ఎందుకు అడుక్కోవాలి. మాకు కూడా ఒక జీవితం ఉంది. అందుకే నటించాలని కలలు కన్నా. అందుకు తగ్గట్టుగానే మిస్టర్ అండ్ మిసెస్ మన్మథ చిత్రంలో హీరోయిన్‌గా అవకాశం వచ్చింది. ఫేస్‌బుక్ ద్వారా తనకు ఈ సినిమా అవకాశం వచ్చింది' అని వెల్లడించింది. 

అంతే కాకుండా ట్రాన్స్‌జెండర్లను ప్రజలు చూసే తీరుపై అసహనం వ్యక్తం చేసింది వైశాలి. బస్సులో ప్రయాణిస్తున్నప్పుడు పక్కన కూర్చోవడానికి జనం సంకోచిస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి పరిస్థితుల్లో సినిమా అవకాశం కోసం నేరుగా గోవాలోని ఓ క్లబ్‌లో డాన్సర్‌గా చేరానని వైశాలి పేర్కొంది. గోవాలో ఉద్యోగం మానేసి ఈ సినిమాలో నటించినట్లు వెల్లడించింది. కాగా.. ఈ చిత్రంలో సుబ్రమణి హీరోగా న‌టించారు. ఇప్పటికే పాటలు, ట్రైలర్ రిలీజ్ కాగా.. ఈ సినిమా అక్టోబర్ 6న విడుదల కానుంది.

(ఇది చదవండి: అండమాన్ దీవుల నేపథ్యంలో సరికొత్త వెబ్ సిరీస్‌.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?)

అసలు ఎవరీ వైశాలి?

వైశాలికి మొదట్నుంచీ నటనపై ఆసక్తి ఎక్కువ. అందువల్లనే వైశాలికి సినిమాలో నటించే అవకాశం వచ్చిందట. ప్రస్తుతం హీరోయిన్‌గా కనిపించనున్న వైశాలి గతంలో గోవాలోని నైట్ క్లబ్‌లలో డ్యాన్సర్‌గా పనిచేసింది. ఆ తర్వాత నటనపై ఉన్న ఆసక్తితో  బెంగళూరుకు వచ్చేసింది. కామెడీ ఖిలాడీ సీజన్- 2 కోసం జరిగిన ఆడిషన్స్‌లో కూడా వైశాలి పాల్గొంది.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top