ఆరాధ్య... | Vijay Devarakonda, Samantha Kushi Movie Second Single Aradhya On 12th July | Sakshi
Sakshi News home page

ఆరాధ్య...

Jul 9 2023 4:18 AM | Updated on Jul 9 2023 4:18 AM

Vijay Devarakonda, Samantha Kushi Movie Second Single Aradhya On 12th July - Sakshi

విజయ్‌ దేవరకొండ, సమంత జంటగా నటించిన చిత్రం ‘ఖుషి’. శివ నిర్వాణ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ యర్నేని, రవిశంకర్‌ యలమంచిలి నిర్మిస్తున్నారు. హిషామ్‌ అబ్దుల్‌ వాహబ్‌ సంగీతం అందించిన ఈ చిత్రంలోని ‘ఆరాధ్య..’ అంటూ సాగే రెండో పాటను బుధవారం రిలీజ్‌ చేస్తున్నట్లు ప్రకటిస్తూ ఓ పోస్టర్‌ను రిలీజ్‌ చేశారు.

‘‘ఖుషి’ నుంచి ఇప్పటికే రిలీజ్‌ చేసిన ‘నా రోజా నువ్వే..’ పాట వంద మిలియన్లకు చేరువలో ఉంది. ‘ఆరాధ్య..’ పాట ప్రోమోను సోమవారం, పాటను బుధవారం విడుదల చేస్తాం’’ అని చిత్రయూనిట్‌ ప్రకటించింది. తెలుగు, తమిళ, మళయాళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ సినిమా సెప్టెంబర్‌ 1న రిలీజ్‌ కానుంది. ఈ చిత్రానికి కెమెరా: జి. మురళి.

Advertisement
 
Advertisement
Advertisement