ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..! | Tollywood Vadde Naveen Shocking comments about his food Habits | Sakshi
Sakshi News home page

Vadde Naveen: ఉదయాన్నే చికెన్.. వడ్డే నవీన్‌ షాకింగ్ లైఫ్‌ స్టైల్..!

Jun 18 2026 10:43 AM | Updated on Jun 18 2026 11:31 AM

Tollywood Vadde Naveen Shocking comments about his food Habits

ఒకప్పుడు టాలీవుడ్‌ హీరో వడ్డే నవీన్‌ గురించి తెలియనివారు ఉండరు. ఆయన హీరోగా ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. కానీ ఆ తర్వాత దాదాపు పదేళ్ల పాటు వెండితెరకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆయన టాలీవుడ్‌లో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ట్రాన్స్‌ఫర్ త్రిమూర్తులు  మూవీతో పదేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొస్తున్నారు. ఈ సినిమా జూన్ 19న థియేటర్లలో సందడి చేయనుంది.

మూవీ రిలీజ్‌కు అంతా సిద్ధం కావడంతో వడ్డే నవీన్ తన సినిమా ప్రమోషన్స్‌తో బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. తాజాగా ఓ ఛానెల్‌తో మాట్లాడిన ఆయన.. తన పర్సనల్ లైఫ్‌ గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. తన డైలీ రోటీన్ లైఫ్, ఆహార విషయాలపై మాట్లాడారు. ఈ సందర్భంగా షాకింగ్ రివీల్ చేశారు. 

ప్రతి రోజు ఉదయాన్నే ఒక గంట వాకింగ్, జిమ్ చేస్తానని వడ్డే నవీన్ తెలిపారు. ఉదయాన్నే టిఫిన్ కాకుండా డైరెక్ట్‌గా మీల్స్ తింటానని వెల్లడించారు. ఉదయమే చికెన్‌, రైస్ తింటా.. లేదంటే వెజ్‌ కర్రీ ఏదైనా సరే రైస్‌తో కలిపి తీసుకుంటానని అన్నారు. అయితే తాను మధ్యాహ్నం లంచ్‌ చేయనని వడ్డే నవీన్‌ షాకింగ్ కామెంట్స్ చేశారు. నైట్ డిన్నర్‌లో కూడా ఉదయం లాగే నాన్‌వెజ్‌తో వెజ్‌ కూడా ఉంటుందని తెలిపారు. ‍అయితే డైలీ లంచ్ చేయకపోవడం ‍అన్నది వింటే మాత్రం కాస్తా షాకింగ్‌గానే అనిపిస్తోంది. రోజులో ఒక పూట తినకుండా ఉండడం అంతా ఈజీ కాదంటున్నారు. 

కాగా.. ‘ట్రాన్స్‌ఫర్‌ త్రిమూర్తులు మూవీతో కమల్‌ తేజ నార్ల దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ మూవీలో రాశీ సింగ్‌ హీరోయిన్‌గా కనిపించనుంది. ఈ సినిమాకు కల్యాణ్‌ నాయక్‌ సంగీతమందించారు. 
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement