తెలుగులో సరికొత్త మిస్టరీ థ్రిల్లర్‌.. ఏ ఓటీటీకి రానుందంటే? | Tollywood Latest Thriller Web Series Streaming Update Goes Viral | Sakshi
Sakshi News home page

Thriller Web Series: అంబటి అర్జున్‌ మిస్టరీ థ్రిల్లర్‌.. స్ట్రీమింగ్‌ ఎక్కడంటే?

Nov 7 2024 6:06 PM | Updated on Nov 7 2024 6:16 PM

Tollywood Latest Thriller Web Series Streaming Update Goes Viral

ప్రస్తుతం సినీ ప్రియులంతా ఎక్కువగా ఓటీటీల వైపు చూస్తున్నారు. సరికొత్త కంటెంట్‌ ఉన్న సిరీస్‌లు, సినిమాలను ఆడియన్స్ ఆదరిస్తున్నారు. భాషతో సంబంధం లేకుండా ఓటీటీ కంటెంట్‌కు ఆదరణ పెరుగుతోంది. అందుకు తగ్గట్టుగానే కొత్త కొత్త కంటెంట్‌తో వెబ్ సిరీస్‌లు వచ్చేస్తున్నాయి. తాజాగా తెలుగులో తెరకెక్కిస్తోన్న వెబ్ సిరీస్‌ హరికథ.. సంభవామి యుగేయుగే. పీరియాడికల్ బ్యాప్‌డ్రాప్‌లో మిస్టరీ థ్రిల్లర్‌గా ఈ సిరీస్‌న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఇందులో హీరో శ్రీకాంత్, పూజిత పొన్నాడ, అర్జున్ అంబటి, బిగ్‌బాస్‌ దివి, రాజేంద్రప్రసాద్ కీలక పాత్రలు పోషిస్తున్నారు.

ఈ సరికొత్త వెబ్‌ సిరీస్ త్వరలోనే ఓటీటీకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని ప్రముఖ ఓటీటీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ సంస్థ వెల్లడించింది. టాలీవుడ్‌లో ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ తొలిసారి ఓటీటీలోకి ఎంట్రీ ఇస్తోంది. ఈ సిరీస్ ద్వారా డిజిటల్‌ ఫ్లాట్‌ఫామ్‌లో తొలిఅడుగు వేయనుంది. దసరా సందర్భంగా  దీనికి సంబంధించిన ఫస్ట్‌ లుక్‌ పోస్టర్‌, టైటిల్‌ రివీల్ చేసింది సంగతి తెలిసిందే.

త్వరలోనే హరికథ సంభవామి యుగే యుగే వెబ్ సిరీస్‌ రిలీజ్ తేదీని ప్రకటిస్తామని పోస్టర్‌ రిలీజ్ చేశారు. ఈ మిస్టరీ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్‌ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సిరీస్‌ను తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాషల్లోనూ స్ట్రీమింగ్ చేయనున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement