సీఎం విజయ్ కాదు.. రియల్ లైఫ్ హీరో..! | Tamilnadu CM Vijay Prooves his humanity against Pregnant Women | Sakshi
Sakshi News home page

CM Vijay: సీఎం అయినా సరే.. తాను కూడా మనిషినే..!

Jun 24 2026 4:32 PM | Updated on Jun 24 2026 4:43 PM

Tamilnadu CM Vijay Prooves his humanity against Pregnant Women

తమిళనాడు సీఎం విజయ్ సినిమాల్లోనే కాదు.. రియల్ లైఫ్‌లోనూ హీరో అనిపించుకున్నారు. సీఎంగా విజయ్ మానవత్వం చాటుకున్నారు. ఇవాళ విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రాల పంపిణీ చేశారు. ఈ సందర్భంగా విజయ్ చేసిన పనికి ప్రశంసలు కురుస్తున్నాయి. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పటికీ తాను కూడా ఒక మనిషేనని నిరూపించారు.

విద్యుత్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగాలు సాధించిన వారికి నియామక పత్రం కోసం ఒక గర్భిణీ స్త్రీ కూడా హాజరైంది. అయితే ఆమెను వేదికపైకి పిలవకుండా విజయ్ స్వయంగా వెళ్లి ఆమెకు అందించారు. సీఎం ‍హోదాలో ఉన్నప్పటికీ మానవత్వాన్ని మరువలేదని నిరూపించారు. ఒక గర్భిణీ పట్ల విజయ్ చూపిన గౌరవానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. కాగా.. ఈ ఏడాది ఏప్రిల్‌ నెలలో జరిగిన ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ కొట్టారు. పూర్తి మెజారిటీ రాకపోయినా కొన్ని పార్టీల మద్దతుతో సీఎం అయ్యారు. 
 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement