సందీప్‌, లావణ్య త్రిపాఠి హిట్‌ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల | Sundeep Kishan And Lavanya Tripathi's Maayavan Released In Telugu | Sakshi
Sakshi News home page

సందీప్‌, లావణ్య త్రిపాఠి హిట్‌ సినిమా.. ఏడేళ్ల తర్వాత తెలుగులో విడుదల

Apr 5 2024 9:35 AM | Updated on Apr 5 2024 10:04 AM

Sundeep Kishan And Lavanya Tripathi's Maayavan Released In Telugu - Sakshi

సందీప్‌ కిషన్‌, లావణ్య త్రిపాఠి, జాకీష్రాఫ్‌ ప్రధాన పాత్రల్లో సి.వి. కుమార్‌ దర్శకత్వంలో తమిళ్‌లో తెరకెక్కిన 'మాయావన్' చిత్రం 'ప్రాజెక్ట్ z' గా ఏప్రిల్‌ 6న తెలుగు ప్రేక్షకుల ముందుకు రానుంది. సుమారు ఏడేళ్ల తర్వాత తెలుగులో డబ్‌ అయి విడుదలైంది.  ఎప్పుడో 2017లో తమిళంలో విడుదలైన ఈ చిత్రాన్ని ఇప్పుడు తెలుగులో రిలీజ్‌ చేయడం కాస్త ఆశ్చర్యం కలిగించే విషయం. తమిళంలో విడుదలైన ఏడేళ్ల తర్వాత ఇప్పుడు తెలుగులో విడుదల చేయడం ఏంటి అని సినీ ప్రేక్షకులు ఆశ్చర్యపోతున్నారు.

2017లో తమిళ్‌లో విడుదలైన 'మాయావన్'  సినిమా ప్రేక్షకులను బాగానే మెప్పించింది.  ఆ ఏడాదిలో బెస్ట్ థ్రిల్లర్ మూవీస్‌లో ఒకటిగా గుర్తింపు కూడా పొందింది. నిర్మాతగా పిజ్జా సినిమాను నిర్మించి హిట్‌ కొట్టిన సీవీ కుమార్ ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అయ్యాడు. అప్పుడు ఈ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు కోలీవుడ్‌లో ‘మాయవన్’కు సీక్వెల్ తెరకెక్కుతోంది. ఇందులో సందీప్‌ కిషనే హీరోగా నటిస్తుండగా..  సీవీ కుమారే దర్శత్వం వహిస్తున్నారు.

ఈ సీక్వెల్‌ పార్ట్‌ను తెలుగులో కూడా విడుదల చేయాలని ప్లాన్‌ చేస్తున్నారట మేకర్స్‌.. కథ అర్థం కావాలంటే మొదటి భాగం చూడాలి. అందుకే ఏడేళ్ల తర్వాత ఈ సినిమా పార్ట్‌-1ను 'ప్రాజెక్ట్ z' గా రేపు విడుదల చేస్తున్నారు. వాస్తవంగా 'మాయవన్' తమిళంలో రిలీజ్‌ అయిన సమయంలోనే తెలుగులో  'ప్రాజెక్ట్-జడ్' పేరుతో అనువాదం చేశారు. రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేశారు. కానీ పలు కారణాలతో అప్పుడు విడుదల కాలేదు. థ్రిల్లర్ సినిమాలను ఇష్ట పడే వారికి 'ప్రాజెక్ట్ z' తప్పక నచ్చుతుందని చెప్పవచ్చు. మాయవన్‌ పేరుతో తమిళ్ వర్షన్‌ యూట్యూబ్‌లో కూడా రన్‌ అవుతుంది. 

Advertisement
 
Advertisement
Advertisement