శ్రీలీలని సీఎం భార్య అవమానించారా? వీడియో వైరల్ | Sreeleela And Amruta Fadnavis Latest News | Sakshi
Sakshi News home page

Sreeleela: శ్రీలీల-సీఎం భార్య.. వైరలవుతున్న వీడియో

Jun 22 2026 11:48 AM | Updated on Jun 22 2026 11:52 AM

Sreeleela And Amruta Fadnavis Latest News

హీరోయిన్ శ్రీలీల.. ప్రస్తుతం తెలుగులో పెద్దగా సినిమాలేం చేయట్లేదు. తమిళ, హిందీలో చేస్తూ బిజీగా ఉంది. అయితే ఈమెని ముఖ్యమంత్రి భార్య అవమానించారని సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతుంది. ఇంతకీ ఏంటి విషయం? అసలేం జరిగింది?

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

యోగా డే వేడుకల సందర్భంగా ముంబైలో భారీ కార్యక్రమం జరిగింది. దీనికి శ్రీలీల, షాహిద్ కపూర్‌తో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ సతీమణి అమృత కూడా తన కుమార్తెతో కలిసి హాజరయ్యారు. ఫొటోలకు పోజులిచ్చే క్రమంలోనే తన కూతురితో పాటు ఫొటో కావాలని చెప్పి అమృత.. శ్రీలీలని పక్కకు వెళ్లి నిలబడమన్నారు. ఈ వీడియో చూసి ‍శ్రీలీల ఫ్యాన్స్ హర్ట్ ‍అయ్యారు. సీఎం భార్య అవమానించారని కామెంట్స్ పెడుతున్నారు.

(ఇదీ చదవండి: పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement