పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ బాలనటి | Hello Movie Child Artist Myrah Dandekar Latest Pics With Kalyani Priyadarshan, New Look Photos Went Viral | Sakshi
Sakshi News home page

Guess The Actress: హీరోయిన్ చిన్నప్పటి పాత్ర.. ఇప్పుడేమో ఆమెకంటే ఎత్తుగా

Jun 22 2026 11:15 AM | Updated on Jun 22 2026 12:10 PM

Hello Movie Child Artist Latest Pics With Kalyani Priyadarshan

కొన్నిసార్లు నటీనటులు ఊహించనంతలా మారిపోయి షాకిస్తుంటారు. ఇప్పుడా లిస్టులోకి ఓ బాలనటి చేరింది. పదేళ్ల తెలుగులో ఒకటి రెండు సినిమాలు చేసి ఈ పాప.. ఇప్పుడు గుర్తుపట్టలేనంతగా మారిపోయి ఆశ్చర్యపరిచింది. తాజాగా తను ఏ హీరోయిన్‌కి అయితే చిన్నప్పటి పాత్ర చేసిందో.. ఇప్పుడు ఆమె కంటే ఎత్తుగా ఎదిగిపోయేసరికి నెటిజన్లు షాకవుతున్నాయి. మరి ఈ నటి ఎవరో గుర్తుపట్టారా?

(ఇదీ చదవండి: సగం రెమ్యునరేషన్‌కే సినిమా చేసిన స్టార్ కమెడియన్)

పైన ఫొటోలో కనిపిస్తున్న నటి పేరు మైరా దండేకర్. ముంబైకి చెందిన ఈమె.. తెలుగులో పదేళ్ల క్రితం వచ్చిన హలో, మిస్టర్ మజ్ను లాంటి సినిమాల్లో బాలనటిగా చేసింది. మరీముఖ్యంగా అఖిల్ అక్కినేని చేసిన 'హలో' మూవీలో యాక్టింగ్‌కి గానూ మంచి గుర్తింపు అందుకుంది. తర్వాత చదువుపై దృష్టి పెట్టడంతో మూవీస్ తగ్గించేసింది.

రీసెంట్‌గా 'హలో' మూవీలో తను ఎవరికైతే బాలనటిగా చేసిందో సదరు హీరోయిన్ కల్యాణి ప్రియదర్శన్‌ని కలిసింది. అందుకు సంబంధించిన ఫొటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జున్ను పదేళ్లలో ఎంతలా మారిపోయిందోనని నెటిజన్లు మాట్లాడుకుంటున్నారు.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 21 సినిమాలు.. ఆ మూడు డోంట్ మిస్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement