ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ! | Sheena Bajaj expecting first child with husband Rohit Purohit | Sakshi
Sakshi News home page

Sheena Bajaj: బుల్లితెర నటి షీనా బజాజ్‌కు ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!

Apr 30 2025 6:20 PM | Updated on Apr 30 2025 6:27 PM

Sheena Bajaj expecting first child with husband Rohit Purohit

ప్రముఖ బుల్లితెర నటి షీనా బజాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, నటుడు రోహిత్ పురోహిత్‌తో కలిసి ఈ శుభవార్తను షేర్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇలాంటి సమయంలో మీ అందరి ప్రార్థన, ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది.  ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు ఈ బుల్లితెర భామకు విషెస్ చెబుతున్నారు.

కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ అనే సీరియల్‌తో షీనా బజాజ్‌ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌తో పాటు ఒకట్రెండు సినిమాల్లోనూ నటించింది. 2019లో రోహిత్‌ పురోహిత్‌ను షీనా బజాజ్ పెళ్లాడింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్‌లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో జైపూర్‌లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె భర్త రోహిత్ ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్‌లో నటిస్తున్నారు. మరోవైపు షీనా బజాజ్ చివరిసారిగా వంశజ్‌ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది.

Advertisement
 
Advertisement
Advertisement