Sheena Bajaj
-
ప్రముఖ బుల్లితెర నటికి ప్రెగ్నెన్సీ.. వీడియో షేర్ చేసిన బ్యూటీ!
ప్రముఖ బుల్లితెర నటి షీనా బజాజ్ అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పింది. త్వరలోనే పండంటి బిడ్డకు జన్మనివ్వనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన భర్త, నటుడు రోహిత్ పురోహిత్‌తో కలిసి ఈ శుభవార్తను షేర్ చేసింది. ఈ మేరకు ఇన్‌స్టా వేదికగా ఓ వీడియోను పంచుకుంది. ఇలాంటి సమయంలో మీ అందరి ప్రార్థన, ఆశీస్సులు కావాలి. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి అంటూ క్యాప్షన్ రాసుకొచ్చింది. ఈ విషయం తెలుసుకున్న అభిమానులు, సినీతారలు ఈ బుల్లితెర భామకు విషెస్ చెబుతున్నారు.కాగా.. బెస్ట్ ఆఫ్ లక్ నిక్కీ అనే సీరియల్‌తో షీనా బజాజ్ ఫేమ్ తెచ్చుకుంది. ఆ తర్వాత పలు సీరియల్స్‌తో పాటు ఒకట్రెండు సినిమాల్లోనూ నటించింది. 2019లో రోహిత్ పురోహిత్‌ను షీనా బజాజ్ పెళ్లాడింది. దాదాపు నాలుగేళ్ల పాటు డేటింగ్లో ఉన్న వీరిద్దరు కుటుంబ సభ్యుల సమక్షంలో జైపూర్‌లో వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. కాగా.. ఆమె భర్త రోహిత్ ప్రస్తుతం యే రిష్తా క్యా కెహ్లతా హై సీరియల్లో నటిస్తున్నారు. మరోవైపు షీనా బజాజ్ చివరిసారిగా వంశజ్ అనే వెబ్ సిరీస్‌లో కనిపించింది. View this post on Instagram A post shared by sheena (@imsheenabajaj) -
సుకుమార్ నిర్మాతగా 'కుమారి 21F' ప్రారంభం
-
సుకుమార్ మార్క్ ప్రేమకథ
‘‘నేను చేసిన ‘ఆర్య’ చిత్రానికి సూర్య ప్రతాప్ అసోసియేట్ డెరైక్టర్‌గా చేశాడు. అతనిలో మంచి ఈజ్ ఉంది. సూర్యప్రతాప్ చెప్పిన లైన్ నచ్చి, ఈ కథ తయారు చేశాను. ఈ కథను తనే తెరకెక్కిస్తే న్యాయం జరుగుతుందనుకున్నా. ఈ చిత్రానికి దేవిశ్రీస్రాద్, రత్నవేలు, రాజ్‌తరుణ్.. ఈ ముగ్గురూ హీరోలు. స్నేహానికి విలువిచ్చి, సంగీతం అందించడానికి దేవిశ్రీప్రసాద్, ఛాయగ్రాహకుడిగా చేయడానికి రత్నవేలు ఒప్పుకున్నారు. సున్నితమైన ప్రేమకథ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది’’ అని దర్శకుడు సుకుమార్ చెప్పారు. ఆయన నిర్మాతగా మారి, సుకుమార్ రైటింగ్స్ పతాకంపై పీఏ మోషన్ పిక్చర్స్ సంస్థ అధినేత థామస్ రెడ్డి ఆదూరితో కలిసి నిర్మిస్తున్న చిత్రం ‘కుమారి 21 ఎఫ్’. పల్నాటి సూర్య ప్రతాప్ దర్శకత్వంలో రాజ్‌తరుణ్, షీనా బజాజ్ జంటగా రూపొందుతున్న ఈ చిత్రం ఆదివారం మొదలైంది. ముహూర్తపు దృశ్యానికి అక్కినేని నాగచైతన్య కెమెరా స్విచాన్ చేయగా, ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు సురేందర్‌రెడ్డి గౌరవ దర్శకత్వం వహించారు. సూర్య ప్రతాప్ మాట్లాడుతూ - ‘‘‘కరెంట్’ తర్వాత నేను దర్శకత్వం వహిస్తున్న చిత్రం ఇది. నన్ను నమ్మి సుకుమార్ అవకాశం ఇచ్చారు. ఆ నమ్మకాన్ని నిలబెడతా’’ అన్నారు. ఈ నెల 16న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తామని నిర్మాతల్లో ఒకరైన థామస్ రెడ్డి ఆదూరి అన్నారు. ఈ చిత్రానికి మాటలు: పొట్లూరి వెంకటేశ్వరరావు, సహనిర్మాతలు: ఎం. రాజా, ఎస్. రవికుమార్. -
సుకుమార్ నిర్మాతగా..రాజ్‌తరుణ్ హీరోగా...
‘నిర్మాతగా మారి సినిమాలు నిర్మించాలని ఉంది’ అని గతంలో ప్రకటించిన దర్శకుడు సుకుమార్... మాట నిలబెట్టుకుంటూ నిర్మాతగా ఓ చిత్రానికి శ్రీకారం చుట్టారు. పిఎ మోషన్ పిక్చర్స్ పతాకంపై విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డిలతో కలిసి ఆయన ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘ఉయ్యాల జంపాల’ ఫేం రాజ్‌తరుణ్ కథానాయకుడు. షీనా బజాజ్ కథానాయిక. ‘కరెంట్’ఫేం పల్నాటి సూర్యప్రతాప్ దర్శకుడు. సుకుమార్ సినిమాల తరహాలో వైవిధ్యంగా సాగే క్యూట్ లవ్‌స్టోరీ ఇదని, సుకుమార్ స్క్రీన్‌ప్లే ఈ చిత్రానికి హైలైట్ అని నిర్మాతలు విజయ్ బండ్రెడ్డి, థామస్ రెడ్డి తెలిపారు. నవంబర్ 9న చిత్రీకరణ ప్రారంభమయ్యే ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: రత్నవేలు, కళ: రవీంద్ర, సహ నిర్మాత: ఎం.రాజా.