51 ఏళ్ల వయసులో స్టార్‌ హీరోయిన్‌ రీ ఎంట్రీకి రెడీ! | Sakshi
Sakshi News home page

Heroine: 30 ఏళ్లుగా వెండితెరకు దూరం.. మర్చిపోయినా పర్లేదు, గుర్తుపెట్టుకునేలా చేస్తానంటూ..

Published Thu, Feb 1 2024 3:39 PM

Senior Heroine Sonam Khan Comeback is not a Bad Word - Sakshi

తెలుగు సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైన ఓ స్టార్‌ హీరోయిన్‌ చాలాకాలం తర్వాత రీఎంట్రీకి సిద్ధమైంది. దాదాపు 35 చిత్రాల్లో నటించిన ఈమె తెలుగులో కేవలం మూడే ముడు సినిమాలు చేయగా ఎక్కువగా బాలీవుడ్‌లోనే బిజీ అయింది. ఆమె నటించిన చివరి చిత్రం ఇన్‌సానియత్‌. ఈ మూవీ 1994లో విడుదలైంది. ఆ తర్వాత వెండితెరపై కనిపించనేలేదు. ఇంతకీ ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా?

పెళ్లి- విడాకులు
ఆమె పేరు సోనమ్‌ ఖాన్‌. సామ్రాట్‌ అనే తెలుగు చిత్రంతో వెండితెరకు పరిచయమైంది. తర్వాత హిందీలోనే వరుస సినిమాలు చేస్తూ ఫుల్‌ బిజీగా మారింది. మధ్యమధ్యలో.. సూపర్‌స్టార్‌ కృష్ణ 'ముగ్గురు కొడుకులు' (ఇందులో రమేశ్‌ బాబుకు జంటగా నటించింది), మోహన్‌బాబు- చిరంజీవి 'కొదమసింహం' చిత్రాల్లో కనువిందు చేసింది. దర్శకరచయిత, నిర్మాత రాజీవ్‌ రాయ్‌ను పెళ్లి చేసుకున్న తర్వాత నెమ్మదిగా సినిమాలకు దూరమైంది. అయితే వైవాహిక జీవితంలో చికాకులు ఎదురవడంతో 2016లో ఆయనకు విడాకులిచ్చేసింది. 30 ఏళ్లుగా వెండితెరకు దూరంగా ఉన్న సోనమ్‌ 51 ఏళ్ల వయసులో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైంది.

వారికి నేను తెలీదు
'త్వరలోనే మళ్లీ మీ ముందుకు వస్తున్నాను. చాలా ఆఫర్లు వస్తున్నాయి.. వాటి గురించి ఆలోచిస్తున్నాను. 40 కంటే తక్కువ వయసున్న వాళ్లకు నేను తెలిసి ఉండకపోవచ్చు. నన్నెవరూ గుర్తుపట్టడం లేదేంటని ఫీలవను. గతంలో ఈ ఇండస్ట్రీలో ఉన్నాను, ఇప్పుడు మళ్లీ ఇక్కడికే వచ్చాను.. ఇక మీదట కూడా ఇక్కడే కొనసాగుతాను, మీరంతా మళ్లీ గుర్తుపెట్టుకునేలా చేస్తాను.

ఓటీటీకే నా ఓటు
కమ్‌బ్యాక్‌ అనేది తప్పేం కాదు, అలాంటప్పుడు నేను తిరిగి ఇండస్ట్రీకి రావడం కూడా సబబైనదే! ఓటీటీలో హీరోహీరోయిన్లు ఉండరు.. కథ, అందులోని పాత్రలే బలంగా కనిపిస్తాయి. సినిమానా? ఓటీటీనా? అని అడిగితే నేనైతే ఓటీటీకే ఓటేస్తాను. ఏదైనా వెబ్‌సిరీస్‌లో నటించాలనుంది. నాతో పాటే కథ సాగాలి.. అలాంటి ఛాన్స్‌ వస్తేనే చేస్తా.. ఇలా అన్నానని నాకు ఇగో ఉందనుకోకండి' అని ముసిముసిగా నవ్వేసింది సోనమ్‌.

చదవండి: కొత్త ప్రియుడితో కలిసి మాజీ లవర్‌కు చుక్కలు చూపించిన నటి.. బ్రేకప్‌ మంచిదే అంటూ..

Advertisement

తప్పక చదవండి

Advertisement