ఆకట్టుకుంటున్న ‘సాక్షి’ టీజర్

Sakshi Movie Teaser Released

సూపర్‌స్టార్ కృష్ణ‌ ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ నుంచి వచ్చిన హీరో శ‌రణ్ కుమార్ నటిస్తున్న సినిమా సాక్షి . శివ కేశ‌న కుర్తి ద‌ర్శ‌క‌త్వం వహిస్తున్న ఈ సినిమాను ఆర్. యూ రెడ్డి అండ్ బేబీ లాలిత్య సమర్పణలో రూపొందిస్తున్నారు. శ్రీ వెన్నెల క్రియేష‌న్స్ బ్యాన‌ర్‌పై ప్రొడ‌క్ష‌న్ నెం.3గా మునగాల సుధాక‌ర్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు షూటింగ్ చేస్తూనే మరోవైపు ప్రమోషన్స్ చేపడుతున్న మేకర్స్.. సరికొత్తగా అప్ డేట్స్ వదులుతూ సినిమాపై హైప్ తీసుకొస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా ప్రముఖ ఇన్ఫ్లూఎన్సర్స్ చేతుల మీదగా ఈ  చిత్ర టీజర్ లాంచ్ చేశారు.

ఒక నిమిషం 9 సెకనుల నిడివితో కట్ చేసిన ఈ టీజర్ లో ఆసక్తికర సన్నివేశాలతో పాటు యాక్షన్ పార్ట్ చూపించారు. గంజాయి స్మగ్లింగ్ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమాలో కొత్త హీరో శ‌రణ్ కుమార్ ఫైట్ సీన్స్ ఇరగ దీశారని ఈ టీజర్ స్పష్టం చేస్తోంది. చిత్రంలో ఏదో కొత్త పాయింట్ టచ్ చేస్తూ సస్పెన్స్ క్రియేట్ చేశారు మేకర్స్.

ఈ సినిమాలో హీరోయిన్ గా జాన్వీర్ కౌర్ నటిస్తుండగా.. నాగబాబు మెయిన్ విలన్‌గా ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. అజయ్, ఇంద్రజ, ఆమని   ఇలా భారీ క్యాస్టింగ్‌తో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. భీమ్స్ సిసిరీలియో సంగీతం అందించిన ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. 

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top