కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను: రవితేజ | Ravi Teja Eagle Success Celebrations | Sakshi
Sakshi News home page

కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను: రవితేజ

Feb 12 2024 1:04 AM | Updated on Feb 12 2024 8:50 AM

Ravi Teja Eagle Success Celebrations - Sakshi

టీజీ విశ్వప్రసాద్, రవితేజ, కావ్యా థాపర్, అవసరాల శ్రీనివాస్,

రవితేజ హీరోగా నటించిన చిత్రం ‘ఈగల్‌’. ఇందులో కావ్యా థాపర్, అనుపమా పరమేశ్వరన్స్  హీరోయిన్లు. కార్తీక్‌ ఘట్టమనేని దర్శకత్వంలో టీజీ విశ్వప్రసాద్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 9న విడుదలైంది. ఈ సందర్భంగా ఆదివారం హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా సక్సెస్‌మీట్‌లో రవితేజ మాట్లాడుతూ– ‘‘ఈగల్‌’కు ప్రేక్షకుల నుంచి వస్తోన్న స్పందన సంతోషాన్నిస్తోంది. కార్తీక్‌ ‘ఈగల్‌’ కథ చెప్పినప్పుడే సహదేవ వర్మ పాత్రకు ఎగ్జైట్‌ అయ్యాను.

నా పాత్ర మేకోవర్‌కు మంచి ప్రశంసలు వస్తున్నాయి. సినిమాలోని కాళికాదేవి ఎపిసోడ్‌లో నన్ను నేను నమ్మలేకపోయాను. పీపుల్‌ మీడియా ఫ్యాక్టరీకి అభినందనలు. హరీష్‌ శంకర్‌తో చేస్తున్న ‘మిస్టర్‌ బచ్చన్స్ ’ సినిమాతో ఈ బ్యానర్లో హాట్రిక్‌ కొడుతున్నాం. కార్తీక్, కావ్యా థాపర్‌లకు మంచి భవిష్యత్‌ ఉంది’’ అన్నారు. ‘‘యాక్షన్స్  సినిమా తీయాలనే నా ఆశ రవితేజగారి ‘ఈగల్‌’తో నెరవేరింది’’ అన్నారు కార్తీక్‌. ‘‘రవితేజగారితో ‘ధమాకా’లాంటి బ్లాక్‌బస్టర్‌ ఇచ్చి, ఇప్పుడు ‘ఈగల్‌’తో ఈ బ్లాక్‌బస్టర్‌ను కొన సాగించాం’’ అన్నారు టీజీ విశ్వప్రసాద్‌. దర్శకుడు హరీష్‌శంకర్, ‘ఈగల్‌’ యూనిట్‌ సభ్యులు ఈ సక్సెస్‌ సెలబ్రేషన్స్ లో పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement