లగ్జరీ కారు కొనుగోలు చేసిన స్టార్ హీరోయిన్.. ఎన్ని కోట్లంటే? | Rakul Preet Singh Buys Swanky New Mercedes Car Worth RS 3.50 Crore - Sakshi
Sakshi News home page

Rakul Preet Singh: ఖరీదైన కారు కొన్న రకుల్.. వీడియో వైరల్!

Aug 23 2023 5:02 PM | Updated on Aug 23 2023 6:03 PM

Rakul Preet Singh Buys Swanky New Mercedes Car Worth RS 3.50 Crore - Sakshi

రకుల్ ప్రీత్ సింగ్ బాలీవుడ్‌తో పాటు టాలీవుడ్‌లోనూ పరిచయం అక్కర్లేని పేరు. గతేడాది 'అటాక్', 'రన్‌వే 34', 'కట్‌ పుట్ల‍ి', 'డాక్టర్ జి', 'థ్యాంక్ గాడ్', ఛత్రివాలి లాంటి బాలీవుడ్ చిత్రాల్లో కనిపించింది. ఈ ఏడాది బూ సినిమాతో ఓటీటీలో అలరించిన రకుల్..  ప్రస్తుతం హిందీ  సినిమాలతో బిజీగా ఉంది భామ. తెలుగులోనూ స్టార్ హీరోలతో పలు సినిమాల్లో నటించింది.    కెరటం సినిమాతో ఎంట్రీ ఇచ్చిస వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్, నాన్నకు ప్రేమతో, సరైనోడు, ధృవ లాంటి సూపర్ హిట్ చిత్రాల్లో కనిపించింది. 

(ఇది చదవండి: తల్లికి రెండో పెళ్లి చేసిన నటుడు.. నెటిజన్ల ప్రశంసలు!)

తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖరీదైన లగ్జరీ కారును కొనుగోలు చేసింది. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. సోషల్ మీడియాలో భారీ ఫాలోయింగ్ భామ.. సరికొత్త మెర్సిడెజ్‌ కారును తన  గ్యారేజ్‌కు తీసుకొచ్చింది. ఆ వీడియోలో తన కారు పరిశీలిస్తూ కనిపించింది. రకుల్ కొత్త మెర్సిడెస్-బెంజ్ కారు విలువ దాదాపు రూ. 3.50 కోట్లుగా ఉంటుందని తెలుస్తోంది. ఇది చూసిన నెటిజన్స్ రకుల్ ప్రీత్ సెలెక్షన్ సూపర్ అంటూ కామెంట్స్ పెడుతున్నారు. 

(ఇది చదవండి: కాజోల్‌తో మొదటి సినిమా.. కానీ ఆ హీరో జీవితంలో అంతులేని విషాదం!)

Advertisement
 
Advertisement
Advertisement