సింగ అడవికి వెళ్లాడు... జంతువులను కాదు... మృగాల్లాంటి మనుషులను వేటాడటానికి. గోపీచంద్ టైటిల్ రోల్‌లో రూపొందుతున్న ‘సింగ’ చిత్రానికి సంబంధించిన కీలక సన్నివేశాలను ఓ అడవిలో చిత్రీకరించారు. ఈ షెడ్యూల్‌తో ‘సింగ’ షూటింగ్ 50 శాతం పూర్తయింది.
యాక్షన్ కొరియోగ్రాఫర్ వి. వెంకట్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ ఈ చిత్రాన్ని విజయ్ చిల్లా, శశి దేవిరెడ్డి నిర్మిస్తున్నారు. మలయాళ నటి అనార్కలి నాజర్ ఈ చిత్రంతో తెలుగు తెరకు కథానాయికగా పరిచయమవుతున్నారు. తాజాగా ముగిసిన షెడ్యూల్ గురించి చె΄్పాలంటే... ఫారెస్ట్ బ్యాక్‌డ్రాప్‌లో స్పెషల్ సెట్స్‌ను నిర్మించి, కీలక సన్నివేశాలను చిత్రీకరించారు.
ఈ యాక్షన్ సన్నివేశాల్లో హీరో ఉపయోగించే ప్రత్యేక ఆయుధాన్ని తయారు చేయించారు. ఆ ఆయుధం పట్టుకుని, అడవిలోని ఓ రాతి గుట్టపై నిలబడిన గోపీచంద్ కొత్త లుక్‌ని విడుదల చేసింది యూనిట్. ‘‘ఈ చిత్రంలో గోపీచంద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుంది. భారీ యాక్షన్, హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో ‘సింగ’ని రూపొందిస్తున్నాం. ఇప్పటివరకు జరిపిన షూటింగ్ చాలా సంతృప్తినిచ్చింది. ఔట్‌పుట్ అద్భుతంగా వచ్చింది. తదుపరి షెడ్యూల్ కోసం మరిన్ని భారీ సెట్స్‌ని సిద్ధం చేయిస్తున్నాం. డిసెంబరులో ఈ సెట్స్‌లో చిత్రీకరణ ఆరంభిస్తాం’’ అని నిర్మాతలు పేర్కొన్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్ సీఎస్, కెమెరా: షామ్ దత్.


