అమ్మ కదిలి వచ్చె...  | BharataVarshamovie Amma Kadhili Vacche Song Launch | Sakshi
Sakshi News home page

అమ్మ కదిలి వచ్చె... 

Oct 15 2026 3:43 AM | Updated on Oct 15 2026 3:43 AM

BharataVarshamovie Amma Kadhili Vacche Song Launch

గోపీచంద్‌ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘భరతవర్ష’. సంకల్ప్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో రీతూ వర్మ హీరోయిన్‌గా నటిస్తున్నారు. పవన్‌ కుమార్‌ సమర్పణలో  శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. దసరా నవరాత్రుల సందర్భంగా ‘భరతవర్ష’ నుంచి ‘అమ్మ కదిలి వచ్చె...’ అంటూ సాగే రెండో పాటను బుధవారం విడుదల చేశారు మేకర్స్‌. ఉత్సవాల నేపథ్యంలో సాగే ఈ పాటలో గోపీచంద్, రీతూ వర్మ కనిపిస్తారు. 

అనుదీప్‌ దేవ్‌ సంగీతం అందించిన ఈ పాటకు కల్యాణ్‌ చక్రవర్తి త్రిపురనేని సాహిత్యం అందించగా, స్కంద వేలువలి పాడారు. ‘‘దుర్గాదేవి ఆరాధనలోని వైభవాన్ని, నవరాత్రి ఉత్సవాల చుట్టూ ఉండే ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని ‘అమ్మ కదిలి వచ్చె...’ పాటలో అద్భుతంగా చూపించాం. భక్తులు భక్తిశ్రద్ధలతో ఆరాధించే శూలాంభ అమ్మవారి ఉత్సవ ఊరేగింపును ఈ పాటలో చూస్తారు. 

ప్రజల భక్తి, ఉత్సాహం, సామూహిక ఆనందం పాటలోని ఆధ్యాత్మిక వైభవాన్ని మరింతగా పెంచాయి. శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంట, కూష్మాండ, స్కంధమాత, కాత్యాయని, కాళరాత్రి, మహాగౌరి, సిద్ధిదాత్రి రూపాలను ఈ పాటలో వేడుకగా ఆవిష్కరించాం. ఈ పాట ప్రేక్షకులకు ఒక గొప్ప ఆధ్యాత్మిక అనుభూతినిచ్చేలా ఉంటుంది. ఈ మూవీ షూట్‌ ముగింపు దశకు చేరుకుంటోంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకి కెమెరా: సౌందర్‌ రాజన్‌.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement