
ఆదిపురుష్.. ఈ పేరు చెబితే చాలు ప్రభాస్ ఫ్యాన్స్, దర్శకుడు ఓం రౌత్‌పై ఇంతెత్తున ఎగిరిపడతారు. ఎందుకంటే మూవీలోని గ్రాఫిక్స్ మరీ నాసిరకంగా ఉంటుంది. పురాణాల్లో రాముడు, రావణాసురుడు అంటే కొన్ని అంశాలు దాదాపు ఒకేలా ఉంటాయి. కానీ వాటిని పూర్తిగా మార్చేసి ఇష్టమొచ్చినట్లు ఓం రౌత్ తీయడంపై అప్పట్లో పెద్ద చర్చ నడిచింది. తర్వాత ఏ గ్రాఫిక్స్ మూవీ వచ్చినా సరే ఔం రౌత్‌పై కచ్చితంగా ట్రోలింగ్ జరుగుతుంది. అయితే రిలీజ్ తర్వాత దీని గురించి ఎప్పుడూ మాట్లాడని ఈ దర్శకుడు.. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తొలిసారి స్పందించాడు. విమర్శలు, ట్రోలింగ్ వల్ల ఎంతో మానసిక క్షోభకు గురయ్యాడో చెప్పాడు.
(ఇదీ చదవండి: హైకోర్ట్ తీర్పు.. 'కాంతార'కు లైన్ క్లియర్)
'జీవితంలో తప్పులు చేయడం సహజం. హిట్ సంతోషాన్ని ఇస్తుంది. ఫ్లాప్ పాఠం నేర్పిస్తుంది. తప్పుల నుంచి గుణపాఠాలు నేర్చుకుని మళ్లీ అలాంటివి జరగకుండా ముందుకెళ్లిపోవడమే జీవితం. అదే మనిషిని బతికిస్తుంది. 'ఆదిపురుష్' విషయంలో వచ్చిన విమర్శల వల్ల చాలా మానసిక ఒత్తిడికి గురయ్యాను. టీమ్‌తో పాటు ఆ ప్రభావం నా కుటుంబంపైనా పడింది. ఫలితంగా నా కాన్ఫిడెన్స్ అంతా పోయింది. ఆ సమయంలో నా కుటుంబం, స్నేహితులు అండగా నిలిచారు. అలా కోలుకోగలిగాను. ప్రేక్షకుల నమ్మకం తిరిగి పొందేందుకు ఇప్పుడు చాలా కష్టపడాలి' అని ఓం రౌత్ చెప్పుకొచ్చాడు.
2015లో 'లోక్‌మాన్య' అనే మరాఠీ సినిమాతో దర్శకుడు అయిన ఓం రౌత్.. తర్వాత హిందీలో 'తానాజీ' అనే పీరియాడికల్ మూవీతో హిట్ కొట్టాడు. ఎప్పుడైతే 'ఆదిపురుష్' వచ్చిందో ఇతడిపై విపరీతమైన ట్రోలింగ్ వచ్చింది. అప్పటినుంచి మరో చిత్రం చేయలేదు. రీసెంట్‌గా 'ఇన్‌స్పెక్టర్ జెండే' మూవీని నిర్మించగా ఇది నేరుగా నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజైంది. రెస్పాన్స్ బాగానే వచ్చింది. ప్రస్తుతం ధనుష్‌తో అబ్దుల్ కలాం బయోపిక్ తీస్తున్నాడు. దీంతో హిట్ కొట్టాడా సరేసరి లేదంటే మాత్రం అంతే!
(ఇదీ చదవండి: 'కాంతార' షూట్‌లో 4-5 సార్లు నేను చనిపోయేవాడిని: రిషభ్ శెట్టి)