తల్లీకొడుకు... యాక్షన్‌ | New Poster Release From Nandamuri Kalyan Ram Arjun Son of Vyjayanthi | Sakshi
Sakshi News home page

తల్లీకొడుకు... యాక్షన్‌

Apr 7 2025 3:16 AM | Updated on Apr 7 2025 3:42 AM

New Poster Release From Nandamuri Kalyan Ram Arjun Son of Vyjayanthi

నందమూరి కల్యాణ్‌రామ్‌(Nandamuri Kalyan Ram) హీరోగా, విజయశాంతి లీడ్‌ రోల్‌లో నటించిన చిత్రం ‘అర్జున్‌ సన్నాఫ్‌ వైజయంతి’(Arjun Son of Vyjayanthi). సయీ మంజ్రేకర్‌ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో సోహైల్‌ ఖాన్, శ్రీకాంత్, ‘యానిమల్‌’ పృథ్వీరాజ్‌ ఇతర కీలక పాత్రల్లో నటించారు. అశోక క్రియేషన్స్, ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌ పతాకాలపై ముప్పా వెంకయ్య చౌదరి సమర్పణలో ప్రదీప్‌ చిలుకూరి దర్శకత్వంలో అశోక్‌ వర్ధన్‌ ముప్పా, సునీల్‌ బలుసు నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 18న విడుదల కానుంది.

ఈ సినిమాలో తల్లీకొడుకు పాత్రల్లో విజయశాంతి, కల్యాణ్‌రామ్‌ నటించారు. అర్జున్‌ పాత్రలో కల్యాణ్‌రామ్, ఐపీఎస్‌ పోలీసాఫీసర్‌ వైజయంతి పాత్రలో విజయశాంతి నటించారు. శ్రీరామ నవమి సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్స్‌ను రిలీజ్‌ చేశారు. తల్లీకొడుకు యాక్షన్‌కి సై అన్నట్లుగా ఓ స్టిల్‌ ఉంది. ‘‘మంచి సినిమాటిక్‌ ఎక్స్‌పీరియన్స్‌తో ఈ మూవీ ఆడియన్స్‌ను అలరిస్తుంది’’ అని చిత్రయూనిట్‌ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: అజనీష్‌ లోక్‌నాథ్‌.

Advertisement
 
Advertisement
Advertisement