ఆలోచన రేకెత్తించే హనీ | Naveen Chandra And Director Karuna Kumar New Movie Honey 50 percentage shooting compelete | Sakshi
Sakshi News home page

ఆలోచన రేకెత్తించే హనీ

Jun 9 2025 12:42 AM | Updated on Jun 9 2025 12:44 AM

Naveen Chandra And Director Karuna Kumar New Movie Honey 50 percentage shooting compelete

‘‘ఈ సినిమా ప్రేక్షకులకు ఎడ్జ్‌ ఆఫ్‌ ది సీట్‌ ఎక్స్‌పీరియన్స్‌ ఇవ్వడంతోపాటు నేటి సమాజపు తీరు తెన్నులపై ఆలోచనలు రేకెత్తిస్తుంది’’ అని తన తాజా చిత్రం ‘హనీ’ గురించి దర్శకుడు కరుణ కుమార్‌ పేర్కొన్నారు. ‘పలాసా’, ‘శ్రీదేవి సోడా సెంటర్‌’, ‘మట్కా’ తర్వాత కరుణ కుమార్‌ దర్శకత్వంలో శరవేగంగా నిర్మాణం పూర్తి చేసుకుంటున్న సినిమా ‘హనీ’.

‘‘చిల్లింగ్‌ కథతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాం. దాదాపు ఎనభై శాతం టాకీ పూర్తయ్యింది. నటీనటుల ప్రతిభకు ఈ సబ్జెక్ట్‌ ఓ సవాల్‌’’ అని చిత్రబృందం పేర్కొంది. శేఖర్‌ మాస్టర్, రవి పీట్ల నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో నవీన్‌ చంద్ర, దివ్యా పిళ్లై, దివి, రాజా రవ్రీంద ప్రధాన తారాగణం.

Advertisement
 
Advertisement
Advertisement