'ప్యారడైజ్' నుంచి మరో విలన్.. కానీ అది మాత్రం | Nani Paradise Movie Raghav Juyal Teaser | Sakshi
Sakshi News home page

Paradise Movie: నాని 'ప్యారడైజ్'.. మరో విలన్ ఎంట్రీ ఇచ్చేశాడు

Jun 19 2026 7:07 PM | Updated on Jun 19 2026 7:10 PM

Nani Paradise Movie Raghav Juyal Teaser

సాధారణంగా నాని ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తుంటాడు. కానీ ప్రస్తుతం 'ప్యారడైజ్' విషయంలో మాత్రం అలా కుదరలేదు. శ్రీకాంత్ ఓదెల తీస్తున్న ఈ చిత్రం లెక్క ప్రకారం ఈ ఏడాది మార్చిలో రిలీజ్ అన్నారు. ఆగస్టు 21కి వాయిదా వేశారు. ఇప్పుడు అదీ జరగట్లేదు. వాయిదా రూమర్స్ నిజమే అని క్లారిటీ వచ్చేసింది. అలానే మరో విలన్ రాఘవ్ జూయెల్ ఎంట్రీ వీడియోని రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: రెండేళ్ల పాటు నరకం చూశా.. తినాలని ఉన్నా తినలేకపోయా: సమంత)

'ప్యారడైజ్'లో జడళ్ అనే పాత్ర నాని చేస్తుండగా.. సికంజా మాలిక్ అనే పాత్రలో మోహన్ బాబు కనిపిస్తారు. ఇప్పుడు సికంజా కొడుకు పాత్ర అయిన విక్రమ్ మాలిక్‌గా రాఘవ్ జూయెల్ నటిస్తున్నాడు. మెడలో కిలోల కొద్ది నగలతో లుక్ డిఫరెంట్‌గా బాగుంది. ఇందులో కాయదు లోహర్ హీరోయిన్. అనిరుధ్ సంగీతమందిస్తున్నాడు. ఇక మూవీ రిలీజ్ విషయానికొస్తే తాజాగా రిలీజ్ చేసిన టీజర్‌లో అయితే విడుదల తేదీ లేదు. దీంతో వాయిదా పక్కా అని తేలిపోయింది. మరి డిసెంబరులో వస్తుందా? లేదంటే వచ్చే ఏడాదిలో థియేటర్లలోకి వస్తుందా అనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: కొత్తోళ్లతో రూ.100 కోట్ల సినిమా.. 'నాగబంధం' ట్రైలర్ రిలీజ్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement