సీఎంగా తొలి బర్త్‌ డే.. సూపర్ హిట్‌ మూవీ రీ రిలీజ్ | Mercel Re Release vijay first birhday after Chief Minister | Sakshi
Sakshi News home page

Vijay: సీఎంగా విజయ్ తొలి బర్త్‌ డే.. సూపర్ హిట్‌ మూవీ రీ రిలీజ్

Jun 14 2026 7:41 AM | Updated on Jun 14 2026 7:41 AM

Mercel Re Release vijay first birhday after Chief Minister

విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్‌ కానుంది. దీంతో ‍విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.

కాగా.. 2017లో విజయ్‌ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు.  తేనాండాళ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్‌ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్‌ ఫిలిమ్స్‌ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్‌ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌ హీరోయిన్లుగా నటించారు. ఎస్‌ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.

ఈ మూవీకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతాన్ని అందించారు.  ఈ చిత్రం అప్పట్లో   దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్‌ సంస్థ అధినేత కెనడీ చెన్నై,  సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement