mercel
-
సీఎంగా తొలి బర్త్ డే.. సూపర్ హిట్ మూవీ రీ రిలీజ్
విజయ్ సీఎం అయ్యాక జరుగుతోన్న ఆయన తొలి బర్త్ డే కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈనెల 22న విజయ్ పుట్టినరోజు కావడంతో ఆయన నటించిన బ్లాక్‌బస్టర్ మూవీ రి రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రంలో విజయ్ త్రిపాత్రాభినయం చేశారు. ఈ సందర్భంగా ఈ నెల 19వ తేదీన మెర్సల్ రీ రిలీజ్ కానుంది. దీంతో విజయ్ అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.కాగా.. 2017లో విజయ్ నటించిన ఈ చిత్రానికి అట్లీ దర్శకత్వం వహించారు. తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన భారీ బడ్జెట్ కథా చిత్రం ఇది కావడం విశేషం. అంతే కాదు తేనాండాళ్ ఫిలిమ్స్ సంస్థ నిర్మించిన వందో సినిమా. ఈ మూవీలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు. ఎస్ జే.సూర్య ప్రతినాయకుడిగా మెప్పించగా.. వడివేలు,కోవై సరళ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ మూవీకి ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. ఈ చిత్రం అప్పట్లో దీపావళికి విడుదలై ఘన విజయాన్ని సాధించింది. కాగా ఈ చిత్రాన్ని సుమారు తొమ్మిది ఏళ్ల తరువాత కేపీ ఫిలింస్ సంస్థ అధినేత కెనడీ చెన్నై, సెంగల్పట్టు, కాంచీపురం, తిరువళ్ళూరు జిల్లాలో 100 థియేటర్లో విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. -
త్రిపాత్రాభినయం.. ముగ్గురు టాప్ హీరోయిన్లు
చెన్నై: అగ్ర హీరోల సినిమాలకు సంబంధించిన ఏ వార్త అయినా వారి అభిమానులకు ఆనందాన్నిస్తుంది. తమిళ అగ్రహీరో విజయ్ తాజా సినిమా 'మెర్సల్' సంబంధించి పలు ఊహాగానాలు షికారు చేస్తున్నాయి. విజయ్ త్రిపాత్రాభినయం చేస్తున్నట్లు ప్రచారం జరుగుతున్న ఈ చిత్రంలో కాజల్ అగర్వాల్, సమంత, నిత్యామీనన్‌లు నాయికలుగా నటిస్తున్నారు. తెరి వంటి సూపర్‌హిట్ చిత్రం తరువాత విజయ్, దర్శకుడు అట్లీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. శ్రీతేనాండాల్ ఫిలింస్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రం ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని విజయ్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. వారికో సంతోషకరమైన వార్త ఏమిటంటే ఏఆర్ రెహ్మాన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్ర ఆడియోను ఆగస్ట్ 20న విడుదల చేయనున్నట్లు చిత్ర వర్గాలు అధికారికంగా శుక్రవారం వెల్లడించాయి. సోనీ మ్యూజిక్ సంస్థ ఈ పాటల హక్కులను పొందింది. దీపావళి రేసులో బరిలోకి దిగేందుకు ఈ చిత్రయూనిట్ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


