గత కొన్నేళ్లుగా వరస ఫ్లాప్స్ దెబ్బకు డీలాపడిపోయిన హీరో రవితేజ.. ఈ ఏడాది 'ఇరుముడి'తో బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్నాడు. రవితేజ ఇంటి నుంచి కొత్త హీరో గత నెలలోనే అరంగేట్రం చేశాడు. అతడే మాధవ్. రవితేజ తమ్ముడు కొడుకు ఇతడు. మాధవ్ చేసిన మూవీ ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది. ఈ మేరకు అధికారిక ప్రకటన చేశారు.
(ఇదీ చదవండి: 'బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్'.. 'బత్తా' లేటెస్ట్ సెన్సేషన్)
మాధవ్ హీరోగా పరిచయమైన సినిమా 'మారెమ్మ'. తెలంగాణ బ్యాక్‌డ్రాప్ స్టోరీతో తీశారు. గత నెల 10న థియేటర్లలో రిలీజైంది. కానీ కనీసం అంటే కనీసం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడీ చిత్రం ఈ శుక్రవారం(అక్టోబర్ 09) నుంచి ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ చేయనున్నట్లు రివీల్ చేశారు. ఇదే తేదీ నుంచి అమెజాన్ ప్రైమ్ ఓటీటీలోనూ అందుబాటులోకి రానుందని తెలుస్తోంది.
'మారెమ్మ' విషయానికొస్తే.. మహిషాపురంలో మారెమ్మ అనే గ్రామ దేవత ఉగ్రరూపం దాల్చకుండా ఉండటానికి ప్రతి పదేళ్లకు ఒకసారి దున్నపోతుని బలి ఇవ్వడం ఆనవాయితీ. అలా బలివ్వాల్సిన ఓ దూడని కర్ణి (మాధవ్ భూపతిరాజు) ఎంతో ప్రేమగా పెంచుతాడు. ఆ దూడ కాస్తా పెద్ద దున్నపోతుగా మారుతుంది. మరోవైపు కర్ణి తన మరదలు మంజు(దీప బాలు)తో ప్రేమలో ఉంటాడు. కానీ కబడ్డీ గేమ్‌లో కర్ణి చేతిలో ఓడిపోయాడనే కక్షతో పక్క ఊరి ఉత్తమ్ (మనీష్) మంజును పెళ్లి చేసుకోవడానికి సంబంధం కుదుర్చుకుంటాడు.
ఇంకోవైపు పాత కక్షల కారణంగా జలంధర్ (వికాస్ వశిష్ట) ఆ దున్నపోతుని అంతం చేయాలని చూస్తుంటాడు. జాతరకు కేవలం నాలుగు రోజులు ఉందనగా ఆ దున్నపోతు కనిపించకుండాపోతుంది. అసలు ఆ దున్నపోతుని ఎవరు తీసుకెళ్లారు? జలంధర్ పగ ఏంటి? కర్ణి,మంజుల ప్రేమకథ ఏమైంది? చివరికి జాతర ఎలా ముగిసిందనేదే మిగతా స్టోరీ.
(ఇదీ చదవండి: ఊపిరి తీసుకోకుండా 16 నిమిషాల ధ్యానం.. టాలీవుడ్ విలన్ సాహసం)


