కొన్నిసార్లు నటీనటులు తమ చర్యలతో షాకిస్తుంటారు. తెలుగు, తమిళంలో పలు సినిమాల్లో విలన్‌గా చేసి గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటుడు విద్యుత్ జామ్వాల్ ఇప్పుడు అలానే చేశాడు. ఏకంగా 16 నిమిషాల పాటు ఊపిరి తీసుకోకుండా ధ్యానం చేసి వైరల్ అయిపోయాడు. ఇంతకీ ఎందుకిలా చేశాడు?
(ఇదీ చదవండి: 'బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్'.. 'బత్తా' లేటెస్ట్ సెన్సేషన్)
ఇప్పటివరకు మన దేశంలోని పలు భాషల్లోని సినిమాల్లో నటించిన విద్యుత్ జామ్వాల్.. హాలీవుడ్‌లోకి 'స్ట్రీట్ ఫైటర్' మూవీతో ఎంట్రీ ఇస్తున్నాడు. వచ్చే శుక్రవారం(అక్టోబర్ 16) ఈ చిత్రం భారతీయ ప్రాంతీయ భాషల్లోనూ రిలీజ్ కానుంది. దీని ప్రమోషనల్ ఈవెంట్.. ముంబైలో సోమవారం జరిగింది. ఇందులో భాగంగానే వేదికపై నిలబడిన విద్యుత్.. ఏకంగా 15 నిమిషాల పాటు శ్వాసని నిలిపి ధ్యానం చేస్తూ తన యోగ సాధనని ప్రదర్శించాడు. దీంతో అక్కడున్నవాళ్లంతా షాక్‌లో ఉండిపోయారు.
ధ్యానం అనంతరం విద్యుత్ మాట్లాడుతూ.. తాను పతంజలి యోగసూత్రాల్లోని ప్రత్యేకమైన ఓ సాధనా పద్ధతిని అనుసరించానని చెప్పాడు. ఈ ప్రాక్టీస్ తన జీవితంలో ఎన్నో విజయాలని సాధించేందుకు ఉపయోగపడిందని, యువతకు కూడా ఈ పద్ధతి నేర్పిస్తున్నానని చెప్పాడు.
(ఇదీ చదవండి: నాన్న బయోపిక్ భగవద్గీతలా ఉంటుంది)
ऐसा टैलेंट हर किसी के बस की बात नहीं🔥😳 . . . #vidyutjammwal #instantbollywood #at https://t.co/8u5xaj7loy
— SourabhNaidu (@SourabhNaidu988) October 6, 2026


