నాన్న బయోపిక్‌ భగవద్గీతలా ఉంటుంది | Actor Rajnikanth Daughter Reacts Father Biopic | Sakshi
Sakshi News home page

Rajnikanth Biopic: నాన్న బయోపిక్‌ భగవద్గీతలా ఉంటుంది

Oct 6 2026 12:44 PM | Updated on Oct 6 2026 12:53 PM

Actor Rajnikanth Daughter Reacts Father Biopic

భారతీయ సినీ చరిత్రలో రజనీకాంత్‌కు ప్రత్యేకస్థానముంది. సాధారణ బస్సు కండక్టర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన.. నటుడి కావాలనే కలని నెరవేర్చుకోవడానికి ఆర్థిక సమస్యలు, అవమానాలు లాంటి ఎన్నో ఆటంకాలు  ఎదురీదారు. చివరికి  నటుడిగా అపూర్వ రాగంగళ్‌ చిత్రంతో వెండితెరపై మెరిశారు. తర్వాత శివాజీ గైక్వాడ్‌ నుంచి రజనీకాంత్‌గా రూపాంతరం చెందారు. తొలి చిత్రంతోనే కె.బాలచందర్‌ అనే దర్శక దార్శనికుడి చేతిలో పడి ప్రతినాయకుడిగా గుర్తింపు పొందారు. తర్వాత భైరవి చిత్రంతో కథానాయకుడిగా అవతారమెత్తి అభిమానుల మనసుల్లో చోటు సంపాదించుకున్నారు.

(ఇదీ చదవండి: ఓటీటీలోకి తెలుగు రొమాంటిక్ సినిమా.. అధికారిక ప్రకటన)

కాలక్రమంలో రజనీకాంత్‌ అనే పేరు ఇండియన్‌ సినిమాలో ఒక బ్రాండ్‌గా మారింది. ఈయన నటుడిగా అర్ధ శతాబ్దం దాటిన ఎవర్‌ గ్రీన్‌ సూపర్‌‌స్టార్‌.. ఇప్పుడు తన జీవిత చరిత్రని రాసుకుంటున్నారు. దీని గురించి ఆయన వారసులు, దర్శక, నిర్మాత ఐశ్వర్య రజనీకాంత్‌ మాట్లాడుతూ.. నాన్న బయోపిక్‌ సూపర్‌గా వస్తోందని, ఒక భగవద్గీత, మహాభారతం తరహాలో ఉంటుందని చెప్పుకొచ్చింది.

రజనీకాంత్‌ బయోపిక్‌ని ముందుగా పుస్తకంగా విడుదల చేసి, తర్వాత వెబ్‌ సిరీస్‌లా తీస్తామని ఐశ్వర్య చెప్పింది. సినిమాగా తీసే ఆలోచన ఉందనే అభిప్రాయాన్ని సౌందర్య రజినీకాంత్‌ వ్యక్తం చేసింది. మరి ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి?

(ఇదీ చదవండి: 'బెస్ట్ మూవీ ఆఫ్ ద ఇయర్'.. 'బత్తా' లేటెస్ట్ సెన్సేషన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement