ప్రముఖ ఆలయంలో మంచు మనోజ్ దంపతుల పూజలు | Manchu Manoj Couple visits Chamudeswari Temple in Mysore | Sakshi
Sakshi News home page

Manchu Manoj : చాముండేశ్వరి ‍అమ్మవారికి మంచు మనోజ్ దంపతుల పూజలు

Oct 8 2026 2:35 PM | Updated on Oct 8 2026 3:00 PM

Manchu Manoj Couple visits Chamudeswari Temple in Mysore

టాలీవుడ్ హీరో మంచు మనోజ్ దంపతులు ప్రముఖ ఆలయాన్ని సందర్శించారు. మైసూరులోని చాముండేశ్వరి అమ్మవారిని దర్శించుకున్నారు. తన భార్యతో మౌనికతో పాటు పిల్లలు ధైరవ్, దేవసేన శోభతో కలిసి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇక సినీ కెరీర్ విషయానికొస్తే మంచు మనోజ్ ప్రస్తుతం డేవిడ్‌ రెడ్డి మూవీలో నటిస్తున్నారు.  హనుమా రెడ్డి దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రంలో రమ్యకృష్ణ నటిస్తున్నారు. 1897, 1920ల మధ్య బ్రిటిష్‌ కాలం నాటి నేపథ్యంలో తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మారియా ర్యాబోషాప్కా హీరోయిన్‌గా కనిపించనున్నారు. సముద్రఖనితో పాటు పలువురు కీలక పాత్రలు పోషిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా పాన్‌ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. 

అంతేకాకుండా బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘దాదా’ మూవీలో కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ మూవీ షూటింగ్ ప్రస్తుతం మైసూరులో జరుగుతోంది. ఈ సందర్భంగా షూటింగ్ నుంచి కాస్త సమయం తీసుకుని కుటుంబంతో కలిసి ఆలయాన్ని సందర్శించారు.

ఇదీ చ‌ద‌వండి: అప్పుడు శ్రీరాముడు... ఇప్పుడు దశరథుడు
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement