ప్రతి తండ్రికి ఈ పాట అంకితం: మహేశ్ బాబు ప్రశంసలు | Mahesh Babu Tweet On Nani Movie Hai Nanna Lyrical Song | Sakshi
Sakshi News home page

Mahesh Babu Tweet: ప్రతి తండ్రికి ఒక గాజు బొమ్మే: సాంగ్‌పై మహేశ్ బాబు ప్రశంసలు

Oct 6 2023 3:15 PM | Updated on Oct 6 2023 3:22 PM

Mahesh Babu Tweet On Nani Movie Hai Nanna Lyrical Song - Sakshi

నేచురల్ స్టార్ నాని, సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం హాయ్ నాన్నా. ఈ చిత్రంలో నాని కూతురిగా బేబీ కియారా నటిస్తోంది. ఈ చిత్రానికి శార్యువ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీని మోహన్ చెరుకూరి, విజేందర్ రెడ్డి నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీ నుంచి గాజుబొమ్మ అంటూ సాగే లిరికల్ సాంగ్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. 

(ఇది చదవండి: 'నా భార్య అర్థం చేసుకుంటది.. నువ్వు నా మాట విను'.. ప్రశాంత్‌ పట్ల శివాజీ ఎమోషనల్!)

అయితే ఈ సాంగ్‌లో తండ్రి, కూతురు మధ్య ప్రేమ ఎలా ఉంటుందో చూపించారు. ఈ సాంగ్‌ చూసిన సూపర్ స్టార్ మహేశ్ బాబు ప్రశంసలు కురిపించారు. హాయ్ నాన్న చిత్రబృందానికి ఆల్‌ ది బెస్ట్ చెబుతూ ట్వీట్ చేశారు.  

మహేశ్ బాబు తన ట్వీట్‌లో రాస్తూ..'ఒక తండ్రి నుంచి అతని కుమార్తె వరకు.. ప్రతి తండ్రి గుండెలో ప్రతిధ్వనించే పాట. హాయ్ నాన్న చిత్రబృందానికి నా ఆల్‌ ది బెస్ట్' అంటూ పోస్ట్ చేశారు. కాగా.. ఈ చిత్రానికి అబ్దుల్ వాహాబ్ సంగీతమందిస్తున్నారు. 

Advertisement
 
Advertisement
Advertisement