టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’ (KRamp) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇందులో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు నటించారు. తొలిసారిగా డైరెక్టర్‌గా ఛాన్స్ దక్కించుకున్న జైన్స్ నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.
'బుర్రపాడు ఎంటర్‌టైనర్' అంటూ 'కె- ర్యాంప్' పోస్టర్‌ను ఆహా (Aha) తెలుగు ఒక పోస్టర్ విడుదల చేసింది. నవంబర్ 15న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోని 'ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా.. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను.. ఏకం కమ్మందా' అనే సాంగ్‌ను కె ర్యాంప్‌లో రీక్రియేట్ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో షోషల్‌మీడియాను షేక్ చేసేలా చాలామంది రీల్స్ చేశారు. గతేడాది దీపావళికి ‘క’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం... ఈ దీపావళికి ‘కె - ర్యాంప్’తో మరో విజయాన్ని దక్కించుకున్నారు.

కథేంటి
కుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్‌మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు.
మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే.


