breaking news
K-Ramp Movie
-
ఓటీటీలో 'కె- ర్యాంప్'.. అధికారిక ప్రకటన
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’ (KRamp) ఓటీటీలోకి రానుంది. ఈమేరకు అధికారికంగా ప్రకటన వచ్చేసింది. దీపావళి పండుగ కానుకగా విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. ఇందులో యుక్తి తరేజా, నరేష్ వీకే, సాయి కుమార్, కామ్నా జెఠ్మలానీ తదితరులు నటించారు. తొలిసారిగా డైరెక్టర్‌గా ఛాన్స్ దక్కించుకున్న జైన్స్ నాని ప్రేక్షకులను మెప్పించాడు. ఈ యూత్‌ఫుల్ ఎంటర్టైనర్ చిత్రాన్ని రాజేష్ దండా, శివ బొమ్మకు నిర్మించారు.'బుర్రపాడు ఎంటర్టైనర్' అంటూ 'కె- ర్యాంప్' పోస్టర్‌ను ఆహా (Aha) తెలుగు ఒక పోస్టర్ విడుదల చేసింది. నవంబర్ 15న ఓటీటీలో స్ట్రీమింగ్ కానున్నట్లు అధికారికంగా ప్రకటించింది. బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ రూ. 50 కోట్ల మార్క్‌ను చేరుకుంది. రాజశేఖర్ నటించిన ఆయుధం సినిమాలోని 'ఇదేమిటమ్మా మాయ మాయ.. మైకం కమ్మిందా.. ఆ ఇంద్రలోకం నిన్ను నన్ను.. ఏకం కమ్మందా' అనే సాంగ్‌ను కె ర్యాంప్‌లో రీక్రియేట్ చేసి మెప్పించారు. ఈ ఏడాదిలో షోషల్మీడియాను షేక్ చేసేలా చాలామంది రీల్స్ చేశారు. గతేడాది దీపావళికి ‘క’ సినిమాతో హిట్ అందుకున్న కిరణ్ అబ్బవరం... ఈ దీపావళికి ‘కె - ర్యాంప్’తో మరో విజయాన్ని దక్కించుకున్నారు.కథేంటికుమార్ అబ్బవరం(కిరణ్ అబ్బవరం) రిచ్ కిడ్. ఎంసెంట్ ఫెయిల్ అవ్వడమే కాకుండా రోజు తాగుతూ..చిల్లరగా ప్రవర్తిస్తుంటాడు. కొడుకు మీద ప్రేమతో నాన్న(సాయి కుమార్) ఒక్క మాట కూడా అనలేకపోతాడు. జ్యోతిష్యుడు సలహాతో మెడిసిన్ చదివించేందుకు కొడుకును కేరళకు పంపుతాడు. అక్కడ కూడా ఇలాగే తాగుతూ ఎంజాయ్ చేస్తున్న కుమార్.. తొలి చూపులోనే క్లాస్మేట్ మెర్సీ(యుక్తి తరేజా)తో ప్రేమలో పడతాడు.మెర్సీ కూడా కుమార్‌ని ఇష్టపడుతుంది. ఇద్దరి ఫ్యామిలీకీ వీరి ప్రేమ విషయం చెప్పి పెళ్లి చేసుకోవాలనుకుంటారు. అదే సమయంలో మెర్సికి అరుదైన వ్యాధి పోస్ట్ ట్రామాటిక్ స్టెస్ డిజార్డర్ (PSTD) ఉందనే విషయం తెలుస్తుంది. ఆమెకు ఉన్న వ్యాదితో కుమార్‌కు ఎలాంటి ఇబ్బందులు ఎదురయ్యాయి? మెర్సీకి ఆ వ్యాది ఎలా సోకింది? దాని పరిష్కారం కోసం కుమార్ ఏం చేశాడు? ఈ కథలో నరేశ్ పాత్ర ఏంటి అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. -
స్టార్ హీరోపై బండ్ల గణేష్ పంచ్‌లు
టాలీవుడ్ నటుడు కిరణ్ అబ్బవరం నటించిన 'K ర్యాంప్' సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయం అందుకుంది. క సినిమా తర్వాత కిరణ్ మరో హిట్ అందుకున్నాడు. దీంతో కె ర్యాంప్ సక్సెస్ మీట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రంలో నిర్మాత బండ్ల గణేష్‌తో పాటు సినీ, రాజకీయ నాయకులు అతిథిలుగా వచ్చారు. ఈ క్రమంలో స్టేజీపై బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. కిరణ్ అబ్బవరాన్ని ఏకంగా మెగాస్టార్ చిరంజీవితో పోల్చడమే కాకుండా.. విజయ్ దేవరకొండపై పరోక్షంగా పంచ్‌లు వేశారని తెలుస్తోంది.బండ్ల గణేష్ కామెంట్లు ఎవరిపై..'K ర్యాంప్' సినిమా సక్సెస్ ఈవెంట్లో బండ్ల గణేష్ చేసిన వ్యాఖ్యలు ఇలా ఉన్నాయి. ' ఈ రోజుల్లో ఒక్క సినిమా హిట్ కాగానే లూజు పేంట్లు, కొత్త కొత్త చెప్పులు, కళ్లకు అద్దాలు పెట్టుకుని ఆపై కాలు మీద కాలు వేసుకుని వాట్సప్.. వాట్సప్ అంటూ తన తర్వాతి సినిమా కోసం లోకేష్ కనగరాజ్‌ను తీసుకురా... రాజమౌళిని తీసుకురా... సుకుమార్‌ను తీసుకురా... అనీల్ రావిపూడిని తీసుకురా అంటున్న ఈ రోజుల్లో ఆరుగురు కొత్త దర్శకులను కిరణ్ పరిచయం చేశాడు. ' అని బండ్ల అన్నారు. ఇప్పటివరకు కిరణ్ చేసిన ప్రతి సినిమా కూడా కొత్త డైరెక్టర్‌తోనే చేశాడని గుర్తుచేశాడు.చిరంజీవిని ఆదర్శంగా తీసుకోకిరణ్ అబ్బవరంను మెగాస్టార్ చిరంజీవితో బండ్ల గణేష్ పోల్చారు. తనపై ప్రశంసల వర్షం కురిపించారు. కిరణ్ ఒక రియల్ కుర్రోడు. బాంచెన్ హీరో అంటే ఇలాగే ఉండాలి. ప్రస్తుతం కిరణ్‌ని చూస్తుంటే నాకు చిరంజీవినే గుర్తొస్తున్నారు. కెరీర్ ప్రారంభంలో చిరంజీవి కూడా ఇలాగే ఉండేవారు. ఆయన ఇప్పటికే 150 సినిమాలు పూర్తి చేసి.. త్వరలో భారతరత్న అందుకోబోతున్నారు. అయినప్పటికీ చిరంజీవి లాంటి వ్యక్తి కూడా గ్రౌండ్ మీద ఉంటాడు. నువ్వు (కిరణ్) చిరంజీవిని ఇన్స్పిరేషన్గా తీసుకుని ముందుకు వెళ్లు.. నిన్ను చూస్తేంటే చాలా ముచ్చటేస్తుంది. అంటూ పొగడ్తలతో ముచ్చేత్తారు.రౌడీ బాయ్స్‌ను టార్గెట్ చేసిన బండ్లసినిమా పరిశ్రమలో విజయ్ దేవరకొండ మాత్రమే ఎక్కువగా 'వాట్సాప్ వాట్సాప్ మై రౌడీ బాయ్స్' అంటూ తన ఫ్యాన్స్‌ను పలకరిస్తుంటాడు. ఇప్పుడు బండ్ల గణేష్ కూడా ఇదే ఆటిట్యూడ్‌తో విజయ్ పేరు ఎత్తకుండా పరోక్షంగా పంచ్‌లు వేశారని సోషల్‌మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఒక హీరోను పొగిడేందుకు మరో నటుడిని కించపరచేలా ఈ వ్యాఖ్యలు ఏంటి అంటూ నెటిజన్లు తప్పుబడుతున్నారు. ఆ మధ్య లిటిల్ హార్ట్స్ ఈవెంట్లో మాట్లాడుతూ ఇండస్ట్రీలో పెద్దలు సెలబ్రిటీలు చేసే పొగడ్తలు నమ్మవద్దు, అన్నీ అబద్దాలే అంటూ నటుడు మౌళికి హితబోధ చేసి ఇప్పుడు ఈ భజన అవసరమా అంటూ బండ్లపై విమర్శలు గుప్పిస్తున్నారు. అయితే, గణేష్ అన్నది నిజంగా విజయ్ దేవరకొండనేనా కాదా అనేది పక్కన పెడితే కిరణ్‌ని పొగిడే క్రమంలో మరొకరి ప్రస్తావన ఎందుకనే ప్రశ్న ఇక్కడ ప్రధాన అంశంగా మారింది. -
యుక్తి తరేజా 'కె-ర్యాంప్' షూటింగ్ జ్ఞాపకాలు (ఫొటోలు)
-
మూవీ రివ్యూవర్స్‌పై కె-ర్యాంప్ నిర్మాత ఆవేదన
ఈ దీపావళి సందర్భంగా కిరణ్ అబ్బవరం నటించిన ‘కె- ర్యాంప్’(K- Ramp Review) సినిమా నేడు (అక్టోబర్ 18) విడుదలైంది. సినిమా చూసిన ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. అయితే, తాజాగా ఈ చిత్ర నిర్మాత రాజేశ్ దండ రివ్యూవర్లపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమ సినిమాకి కొందరు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడినట్లు ఆయన పేర్కొన్నారు. కొందరు రివ్యూవర్లు కావాలనే ఇలాంటి పనులు చేస్తున్నారని ఆవేదన చెందారు.మీడియా సమావేశంలో కె- ర్యాంప్ చిత్ర నిర్మాత రాజేశ్ ఇలా అన్నారు. 'ఈ సినిమా కేవలం నవ్వుకునేందుకు మాత్రమే తీశాం. ఇందులో లాజిక్స్ వెతకాలని చూస్తే ఏం చేయలేం. మా సినిమాకు రివ్యూవర్లు ఇచ్చిన రేటింగ్స్ చూసి చాలా బాధపడ్డాను. మీ అభిప్రాయాన్ని నేను తప్పకుండా అంగీకరిస్తాను. కానీ, ఇక్కడ ఒక పొరపాటు జరుగుతుంది. మా లాంటి చిన్న నిర్మాతల మీద వివక్ష చూపుతున్నారు. సోషల్‌మీడియాలో కొన్ని సినిమాలకు ఫస్టాఫ్ రివ్యూ ఇచ్చేసి కాస్త గ్యాప్ తీసుకున్న తర్వాతే సెకండాఫ్ రివ్యూ ఇస్తున్నారు. అలా ఎందుకు చేస్తున్నారు..?మరికొందరు మాత్రం రివ్యూ షేర్ చేసి చాల సమయం తర్వాతే రేటింగ్ ఇస్తున్నారు. నేను చిన్న నిర్మాతననే ఇలా చేస్తున్నారా.. ఈ సమస్య నాకు మాత్రమే కాదు . ఇండస్ట్రీలో చాలామంది నిర్మాతలు ఇదే ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు రివ్యూ ఇచ్చేందుకు బాహుబలి లాంటి సినిమాకు ఎంత శ్రద్ధ పెడుతారో కె- ర్యాంప్ లాంటి చిత్రానికి కూడా అంతే ప్రాముఖ్యత ఇవ్వాలి. కానీ, కొందరు వివక్ష చూపుతున్నారు. ఇలాంటి దోరణి ఇకనైనా మారాలి.' అని ఆయన అన్నారు.నిర్మాత రాజేశ్ వ్యాఖ్యలపై నెటిజన్లు నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. సినిమా బాగుందంటూ ఆయనకు ఆండగా నిలబడుతున్నారు. ఇందులో కిరణ్ అబ్బవరం నటన సూపర్ అంటూ మెచ్చుకుంటున్నారు. ఆపై హీరోయిన్ యుక్తి తరేజా మీద ప్రశంసలు కురిపిస్తున్నారు. ఈ మూవీలో ఆమె పాత్ర చాలా బలంగా ఉన్నప్పటికీ అంతే రేంజ్లో దుమ్మురేపిందంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.


