గ్రాండ్‌గా ఫైమా పెళ్లి వేడుక.. తాళి కట్టు వేళ కన్నీటి పర్యంతం..! | Jabardasth faima marriage celebrations Officially knot with praveen nayak | Sakshi
Sakshi News home page

faima: గ్రాండ్‌గా ఫైమా పెళ్లి వేడుక.. తాళి కట్టు వేళ కన్నీటి పర్యంతం..!

Jun 25 2026 4:36 PM | Updated on Jun 25 2026 4:55 PM

Jabardasth faima marriage celebrations Officially knot with praveen nayak

జబర్దస్త్ ఫైమా అభిమానులకు సడన్ సర్‌ప్రైజ్ ఇచ్చింది. చాలా సింపుల్‌గా రిజిస్టర్‌ మ్యారేజ్ చేసుకుని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తన ప్రియుడు ప్రవీణ్ నాయక్‌ను పెళ్లాడింది. తొమ్మిదేళ్ల ప్రేమ, ఎన్నో ఇబ్బందులు, అవమానాలు ఎదుర్కొన్నామని ఫైమా ఎమోషనల్‌గా రాసుకొచ్చింది. తన పెళ్లికి సంబంధించిన వీడియోను ఇన్‌స్టాలో షేర్ చేసింది. ఈ విషయం తెలుసుకున్న పలువురు టాలీవుడ్ తారలు, అభిమానులు ఫైమాకు శుభాకాంక్షలు చెప్పారు.

తాజాగా ఫైమా మరో వీడియోను షేర్ చేసింది. చాలా సింపుల్‌గా చేసుకున్నానని తెలిపిన.. ఇవాళ హల్దీ వేడుక చేసుకున్న వీడియోను పోస్ట్ చేసింది. రిజిస్టర్ మ్యారేజ్ తర్వాత సంప్రదాయం ప్రకారం మరోసారి వీరిద్దరు పెళ్లి చేసుకున్నారు. ఆమె ప్రియుడు ప్రవీణ్ మెడలో మూడు ముళ్లు వేసిన వీడియోను కూడా పంచుకుంది. తాళి కట్టు వేళ తన భావోద్వేగాలను ఆపుకోలేపోయింది. ఏడుస్తూ కన్నీటి పర్యంతమైంది. ఈ వీడియో సోషల్ మీడియోలో వైరల్‌గా మారింది.

 

 

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement