తింటుంటే అన్నంలో రక్తం.. రూ.10 ఇస్తే కడుపు నింపుకుందామని.. హరి కష్టాలు | Comedian Express Hari Shares His Struggles | Sakshi
Sakshi News home page

మిగిలిన ఒక్క ఇడ్లీ కోసం మోకాలు పగలకొట్టుకునేవాళ్లం.. హరి కష్టాలు

Jun 18 2025 6:56 PM | Updated on Jun 18 2025 7:13 PM

Comedian Express Hari Shares His Struggles

పటాస్‌ షోతో ఫేమస్‌ అయ్యాడు ఎక్స్‌ప్రెస్‌ హరి (Express Hari). పలు టీవీషోలలో పాల్గొంటూ బుల్లితెర ప్రేక్షకులకు నవ్వులు పంచుతున్నాడు. కమెడియన్‌గా రాణిస్తున్న అతడు ఒకప్పుడు ఎన్నో కష్టాలు పడ్డాడు. పిడికెడంత అన్నం కోసం రక్తాలే చిందించాడు. ఈ విషయాన్ని తాజాగా ఓ షోలో వెల్లడించాడు. తేజస్వి మదివాడ(Tejaswi Madivada) హోస్ట్‌గా వ్యవహరిస్తున్న కాకమ్మ కథలు రెండో సీజన్‌కు ఎక్స్‌ప్రెస్‌ హరి గెస్టుగా వచ్చాడు. ఈ సందర్భంగా తన కష్టాలు ఏకరువు పెట్టాడు.

అన్నంలో రక్తపు బొట్లు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి నేను కష్టాలు చేశాను. మా పాఠశాలలో 250 మంది ఉండేవారు. చేతికి దెబ్బ తగిలి అన్నం తింటుంటే ఆ రక్తం భోజనంలో పడేది. మిగిలిపోయిన ఇడ్లీ కోసం పిలిస్తే ఎలా పరిగెత్తేవాళ్లమో తెలుసా? కిందపడి మోకాళ్లు గీసుకుపోయేవి. ఆ లైన్‌లో ముందు నిలబడితే ఒక ఇడ్లీ వస్తుంది కదా అన్న ఆరాటం!

క్యాంటీన్‌లో చపాతీ కొనుక్కోవడానికి..
మధ్యాహ్న సమయంలో అందరూ క్యాంటీన్‌కు వెళ్లి తినేవారు. అప్పుడు నాకు ఎవరైనా పది రూపాయలు ఇస్తే ఒక చపాతీ కొనుక్కుని తినాలనుకునేవాడిని అని చెప్పుకొచ్చాడు. ఆ మాటలు విని తేజు ఎమోషనలైంది. వెంటనే లేచి హరికి హగ్‌ ఇచ్చి ఓదార్చింది. నటి తేజస్వి యాంకరింగ్‌ చేస్తున్న కాకమ్మ కథలు టాక్‌ షో ఆహాలో ప్రసారమవుతోంది.

చదవండి: చై-శోభితను పట్టించుకోని మహేశ్‌? వీడియోతో ఆన్సర్‌ దొరికేసింది!

Advertisement
 
Advertisement
Advertisement