అతడి నిజస్వరూపం బయటపడాలన్న యష్మి | Bigg Boss Telugu 8 Promo: Gautham Krishna Complaints about Yashmi Gowda | Sakshi
Sakshi News home page

'కెమెరాలతో కాదు మనుషులతో మాట్లాడు'.. 'యష్మిలో అదే నచ్చదు'

Nov 24 2024 4:18 PM | Updated on Nov 24 2024 4:45 PM

Bigg Boss Telugu 8 Promo: Gautham Krishna Complaints about Yashmi Gowda

ఒకరి పొరపాట్లను మరొకరు పేపర్‌పై రాయాలన్నాడు బిగ్‌బాస్‌. తన మీద వచ్చిన ఫిర్యాదు చదివిన కంటెస్టెంట్‌.. అది ఎవరు రాయాలో గెస్‌ చేయాల్సి ఉంటుంది. అలా తేజ. తనపై వచ్చిన కంప్లైంట్‌ చదివాడు. తను మాట్లాడదల్చుకుంది మాట్లాడేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. తను చెప్పేది మాత్రమే నిజమని భావిస్తాడు అని రాసుంది. ఇది కచ్చితంగా విష్ణుప్రియ, యష్మి రాసుంటారని తేజ అభిప్రాయపడ్డాడు.

ఫిర్యాదుల గోల
అన్‌ప్రిడక్టబుల్‌గా ఉండటం వల్ల తనను నేను నమ్మలేను. చాలా త్వరగా ట్రిగ్గర్‌ అవుతుంది. అది నాకు నచ్చదు.. ఈ ఫిర్యాదు తనపై గౌతమ్‌ చేసి ఉంటాడని యష్మి గెస్‌ చేసింది. కెమెరాలతో కన్నా మనుషులతో ఎక్కువ మాట్లాడు.. ఫుడ్‌ విషయంలో అందరికోసం ఆలోచించు అని గౌతమ్‌కు ఫిర్యాదు వచ్చింది. ఇది విష్ణు, అవినాష్‌ కంప్లైంట్‌ చేసుంటారన్నాడు.

నిజస్వరూపం చూపించాలి
ఆటపట్ల ఆసక్తి ఉన్నట్లు అనిపించలేదు, అందర్నీ నిరుత్సాహపరుస్తుంది అని అవినాష్‌.. విష్ణుప్రియపై కంప్లైంట్‌ చేశాడు. కామెడీ వెనకున్న ఎమోషన్స్‌ దాచుకోవడం ఆపేసి తన నిజస్వరూపం అందరికీ చూపించాలి అని యష్మి.. అవినాష్‌ గురించి రాసింది. ప్రోమోలో చివర్లో పృథ్వీ, యష్మి డేంజర్‌ జోన్‌లో ఉన్నట్లు చూపించారు. అయితే యష్మి ఎలిమినేట్‌ అన్న విషయం ఇదివరకే తెలిసిందే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement