మణికంఠకు భార్య నుంచి సర్‌ప్రైజ్‌.. దక్కనివ్వని యష్మి | Bigg Boss 8 Telugu Promo: Home Food for Contestants, But there is a Twist | Sakshi
Sakshi News home page

Bigg Boss Telugu 8: యష్మి చేసిన పనికి బోరుమని ఏడ్చిన మణి.. పగ తీర్చుకున్నాడుగా!

Oct 4 2024 4:15 PM | Updated on Oct 4 2024 4:27 PM

Bigg Boss 8 Telugu Promo: Home Food for Contestants, But there is a Twist

బిగ్‌బాస్‌ తెలుగు ఎనిమిదో సీజన్‌ మొదలై నెలరోజులైపోయింది. అయినవాళ్లను వదిలేసి వచ్చిన హౌస్‌మేట్స్‌కు ఇంటి మీద ఆల్‌రెడీ బెంగ మొదలైంది. ఈ బెంగను ఎంతోకొంత తీర్చేందుకు బిగ్‌బాస్‌ ఇంటి భోజనం ప్లాన్‌ చేశాడు. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి రుచిరకమైన భోజనం తెప్పించాడు. అలాగే ప్రియమైనవారి లేఖలు సైతం వచ్చాయని గుడ్‌న్యూస్‌ చెప్పాడు.

ఇద్దరిలో ఒక్కరికే ఛాన్స్‌..
కానీ అంతలోనే మరో బ్యాడ్‌న్యూస్‌ చెప్పాడు. కన్ఫెషన్‌ రూమ్‌లోకి వెళ్లే ప్రతి కంటెస్టెంట్‌.. తన ముందు ఇద్దరికి సంబంధించిన ఫుడ్‌ ఉంటుంది. అందులో ఒక్కరి ఫుడ్‌ మాత్రమే తీసుకుని మరొకరిది తిరస్కరించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో యష్మి ఎదుట నిఖిల్‌ కోసం అతడి తల్లి చేసిన వంటను, మణికంఠ కోసం అతడి భార్య చేసిన వంటను రెడీగా పెట్టారు. వీరికి ఇంటి నుంచి లెటర్స్‌ కూడా వచ్చాయని బిగ్‌బాస్‌ తెలిపాడు.

మణికంఠ టెన్షన్‌
అయితే మణికంఠపై పీకలదాకా కోపం పెంచుకున్న యష్మి.. నిఖిల్‌కే ఇస్తానంది. దీంతో మణి.. విదేశాల్లో ఉన్న తన భార్య ఇండియాకు ఎందుకొచ్చేసిందో అర్థం కావట్లేదు, ఈ షో వల్ల ఏమైనా జరిగుంటుందా? అని ఏడ్చేశాడు. అటు మణికంఠకు పృథ్వీ, యష్మి ఫుడ్‌ ఎదురుగా పెట్టి ఏదో ఒకటి సెలక్ట్‌ చేసుకోమన్నాడు.

సోనియాను మర్చిపోని నిఖిల్‌
అందుకు మణి.. పృథ్వీకే ఇంటి భోజనం ఇవ్వాలనుకుంటున్నట్లు తెలిపాడు. ఈ నిర్ణయం విని యష్మి కన్నీళ్లు ఆపుకోలేకపోయింది. ఇక ఈ ఇంట్లో ఎవరంటే బాగా ఇష్టం? అని నిఖిల్‌ను ప్రశ్నించగా అతడు సోనియా పేరు చెప్పాడు. మరి ఎవరెవరు ఇంటి భోజనాన్ని ఆస్వాదించారో తెలియాలంటే నేటి ఎపిసోడ్‌ వచ్చేవరకు ఆగాల్సిందే!

 

మరిన్ని బిగ్‌బాస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి

Advertisement
 
Advertisement
Advertisement