Bigg Boss 7 విన్నర్ పల్లవి ప్రశాంత్ షాకింగ్ డెసిషన్.. వాళ్లపై రివేంజ్!? | Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Defamation Case On YouTube Anchors | Sakshi
Sakshi News home page

Pallavi Prashanth: వాళ్ల చేసిన దానికి కౌంటర్ ఇవ్వబోతున్న రైతుబిడ్డ.. జరిగే పనేనా?

Dec 25 2023 11:02 AM | Updated on Dec 28 2023 7:18 PM

Bigg Boss 7 Telugu Winner Pallavi Prashanth Defamation Case On Youtube Anchors - Sakshi

'బిగ్‌బాస్ 7' ఫేమ్ పల్లవి ప్రశాంత్.. షోలో గెలిచిన తర్వాత చాలా హడావుడి చేశాడు. దీంతో పోలీసులు అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. తాజాగా బెయిల్‌పై బయటకొచ్చాడు. ప్రతి ఆదివారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కి వచ్చి వెళ్లాలని కండీషన్ పెట్టిన పోలీసులు.. కొన్నాళ్లకు ఇంటర్వ్యూలు లాంటివి ఏం ఇవ్వకూడదని కూడా చెప్పారు. ఇదంతా పక్కనబెడితే ఈ రైతుబిడ్డ.. కొందరిపై రివేంజ్ తీర్చుకోబోతున్నట్లు తెలుస్తోంది. 

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో 'బిగ్‌బాస్ 7' షోలో పాల్గొన్న పల్లవి ప్రశాంత్.. ఎలాగైతేనేం విజయం సాధించాడు. అయితే డిసెంబరు 17న ఫినాలే అయిపోయిన తర్వాత అన్నపూర్ణ స్టూడియో బయట ఇతడి ఫ్యాన్స్ చాలామంది వచ్చి చేరారు. దీంతో ముందు జాగ్రత్తగా పోలీసులు.. ప్రశాంత్‌ని వేరే రూట్ నుంచి వెళ్లిపోమని చెప్పారు. కానీ మనోడు పోలీసులు మాట కూడా లెక్క చేయకుండా.. తిరిగి అక్కడికి వచ్చాడు. దీంతో ఇతడి అభిమానులు రెచ్చిపోయారు. పలువురి కంటెస్టెంట్స్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులు, పోలీసు వాహనాలు కూడా ధ్వంసం చేశారు.

దీన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు.. ప్రశాంత్‌ని అతడి ఊరికెళ్లి మరీ అరెస్ట్ చేశారు. కోర్టు 14 రోజుల విధించగా.. చంచల్ గూడా జైల్లో పెట్టారు. నాలుగు రోజుల తర్వాత ఇతడికి బెయిల్ రావడంతో తిరిగి ఊరికివెళ్లిపోయాడు. ఇదంతా పక్కనబెడితే.. ఫినాలే అయిపోయిన తర్వాత ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం ప్రయత్నించగా, తన ఊరికొస్తే ఇంటర్వ్యూ ఇస్తానని చెప్పినట్లు కొన్ని వీడియోలు వైరల్ అయ్యాయి.

(ఇదీ చదవండి: రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే?)

తీరా సదరు యూట్యూబర్స్.. ప్రశాంత్ ఇంటర్వ్యూ కోసం అతడి ఊరికి వెళ్లగా, చాలాసేపు వెయిట్ చేయించి తమని నిర్ధాక్షిణ్యంగా వెళ్లిపోమన్నాడని కొందరు ఇన్ స్టాలో స్టోరీలు పెట్టారు. అయితే తాను అలసిపోవడం వల్లే ఇంటర్వ్యూలు ఇవ్వలేకపోయినని ప్రశాంత్ తీరిగ్గా వీడియో పోస్ట్ చేశాడు గానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. ప్రశాంత్ అసలు రంగు ఏంటో అందరికీ తెలిసిపోయింది. అయితే తన ఇమేజ్ డ్యామేజ్ చేసిన సదరు యూట్యూబర్స్‌పై ప్రశాంత్ ఇప్పుడు పరువు నష్టం దావా వేయాలని అనుకుంటున్నాడట.

ఇందులో ఎంత నిజముందనేది పక్కనబెడితే.. ఇది జరిగే పనేనా అనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే ప్రశాంత్.. ఆర్టీసీ బస్సులు ధ్వంసం చేసిన కేసులో అరెస్ట్ అయి, బెయిల్‌పై బయటకొచ్చాడు. ఇలాంటి టైంలో పరువు నష్టం దావా లాంటి కొత్త తలనొప్పులు తెచ్చుకుంటాడా? అనేది చూడాలి. మరి ఈ విషయంలో నెక్స్ట్ ఏం జరుగుతుందో?

(ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్)

Advertisement
 
Advertisement
Advertisement