రెండో పెళ్లి చేసుకున్న స్టార్ హీరో తమ్ముడు.. అమ్మాయి ఎవరంటే? | Sakshi
Sakshi News home page

Arbaaz Khan: విడాకులు తీసుకున్న ఆరేళ్లకు తెలుగు విలన్‌కి మళ్లీ పెళ్లి

Published Mon, Dec 25 2023 10:26 AM

Actor Arbaaz Khan Second Marriage With Shura Khan - Sakshi

స్టార్ హీరో తమ్ముడు, ప్రముఖ నటుడు రెండో పెళ్లి చేసుకున్నాడు. గత కొన్ని రోజుల నుంచి ఈ వివాహం గురించి రూమర్స్ వచ్చాయి. కానీ వీటిపై ఎవరూ పెద్దగా స్పందించలేదు. తాజాగా ఆదివారం రాత్రి ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఇంతకీ ఎవరా నటుడు? ఎవర్ని పెళ్లి చేసుకున్నాడు?

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ సోదరుడు అర్భాజ్ ఖాన్.. నటుడు, నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 1998లోనే నటి మలైకా అరోరాని పెళ్లి చేసుకున్నాడు. 2017 వరకు వీళ్లు సంసారం చేశారు. కానీ మనస్పర్థల కారణంగా విడాకులు తీసుకున్నారు. మలైకా- హీరో అర్జున్ కపూర్‌తో రిలేషన్‌లో ఉంది. అటు అర్బాజ్.. నటి జియార్జియా ఆండ్రియానితో నాలుగేళ్లు ప్రేమలో ఉండి ఇటీవలే బ్రేకప్‌ చెప్పాడు.  అయితే కొన్నిరోజుల నుంచి అర్బాజ్ రెండో పెళ్లి గురించి రూమర్స్ వచ్చాయి.

(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్)

అయితే పెళ్లి నిజమా కాదా? అని అందరూ అనుకున్నారు. తాజాగా ముంబయిలోని తన సోదరి అర్పితా ఖాన్ ఇంట్లో అర్బాజ్, మేకప్ ఆర్టిస్టు షురా ఖాన్‌తో నిఖా చేసుకున్నాడు. ఈ వేడుకకు సల్మాన్ కుటుంబ సభ్యులు, పలువురు సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ‍అర్బాజ్ పెళ్లిలో అతడి కొడుకు కూడా కనిపించడం విశేషం. తన పెళ్లి ఫొటోల్ని పోస్ట్‌ చేసిన అర్బాజ్.. అందరి ఆశీర్వాదం కావాలని క్యాప్షన్ పెట్టుకొచ్చాడు. ప్రస్తుతం కొత్తజంటకు అందరూ శుభాకాంక్షలు చెబుతున్నారు.

హిందీలో నటుడు, నిర్మాతగా చాలా సినిమాలు చేసిన అర్భాజ్.. తెలుగులోనూ మెగాస్టార్ చిరంజీవి 'జై చిరంజీవ' మూవీలో విలన్‪‌గా నటించి మెప్పించాడు. 2017లో రాజ్ తరుణ్ 'కిట్టుగాడు ఉన్నాడు జాగ్రత్త' చిత్రంలోనూ నటించాడు. అయితే ఇక్కడ ఆఫర్స్ రాలేదో ఏమో గానీ చాలావరకు హిందీలో యాక్ట్ చేస్తూ వస్తున్నాడు. 

(ఇదీ చదవండి: ఆ డబ్బులు ఎగ్గొట్టిన తండ్రి.. అసలు విషయం చెప్పిన అల్లు అర్జున్)

Advertisement
 
Advertisement