మంచం పట్టిన 'బలగం' నటుడు.. ప్రస్తుతం దీనస్థితిలో | Balagam Actor Gv Babu Present Health Condition | Sakshi
Sakshi News home page

Balagam: 'బలగం' నటుడికి తీవ్ర అనారోగ్యం.. సాయం కోసం ఎదురుచూపులు

May 6 2025 3:27 PM | Updated on May 6 2025 3:38 PM

Balagam Actor Gv Babu Present Health Condition

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ట్రెండ్ సెట్టర్ గా నిలిచిన సినిమా బలగం. జబర్దస్త్ కమెడియన్ వేణు.. ఈ చిత్రంతో దర్శకుడిగా అందరినీ ఆశ్చర్యపరిచాడు. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో తీసిన ఈ సినిమాలో ఎందరో పల్లె కళాకారులు కూడా నటించారు. ఇప్పుడు వాళ్లలో ఒకరైన జీవీ బాబు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారు.

బలగం మూవీలో ప్రధానపాత్ర కొమురయ్యకు తమ్ముడు అయిన అంజన్నగా జీవీ బాబు నటించారు. వరంగల్ కి చెందిన ఈయన స్వతహాగా రంగస్థల కళాకారులు. ఎన్నో స్టేజీ షోలు, నాటకాలు కూడా వేసేవారు. అయితే ఈ సినిమా తర్వాత కూడా ఒకటి రెండు సినిమాలు చేశారు కానీ పెద్దగా గుర్తింపు రాలేదు. ఇంతలో అనారోగ్య సమస్యలు తీవ్రమయ్యాయి.

(ఇదీ చదవండి: చిరంజీవి పక్కన ఛాన్స్ కొట్టేసిన టాలీవుడ్ 'ఎమ్మెల్యే'!)

జీవీ బాబు ప్రస్తుతం మూత్ర పిండాల సమస్యతో బాధపడుతున్నారు. వరంగల్ జిల్లాలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో ఈయనకు చికిత్స అందిస్తున్నారు. ఆరోగ్యం కుదుటపడాలంటే చాలా డబ్బు ఖర్చు అవుతుందని డాక్టర్లు చెప్పారు. దీంతో దాతల సాయం కోసం ఈయన కుటుంబ సభ్యులు ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం, ఇండస్ట్రీ వాళ్లు ఈయనకు సాయం చేయాలని కోరుతున్నారు.

ఇకపోతే బలగం తర్వాత దర్శకుడు వేణు మరోసారి తెలంగాణ బ్యాక్ డ్రాప్ స్టోరీతో ఎల్లమ్మ సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. కాకపోతే షూటింగ్ మొదలవడానికే చాలా సమయం పట్టేలా కనిపిస్తుంది. తొలుత నాని హీరో అనుకున్నారు. కానీ ఇప్పుడు నితిన్ లైన్ లోకి వచ్చాడు. ఇంకా హీరోయిన్ ఎవరనే దగ్గర కన్ఫ్యూజన్ నడుస్తోంది.

(ఇదీ చదవండి: ఆస్పత్రిలో నటుడు ఉపేంద్ర.. ఏమైందంటే?)

Advertisement
 
Advertisement
Advertisement