అల్లు అర్జున్‌- లోకేశ్‌ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత? | Allu Arjun and Lokesh Kanagaraj Movie Stopped viral On Social Media | Sakshi
Sakshi News home page

Allu Arjun: బన్నీ- లోకేశ్‌ మూవీ ఆగిపోయిందా?.. ఇందులో నిజమెంత?

Jun 3 2026 6:38 PM | Updated on Jun 3 2026 7:03 PM

Allu Arjun and Lokesh Kanagaraj Movie Stopped viral On Social Media

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌ ప్రస్తుతం అట్లీ డైరెక్షన్‌లో భారీ బడ్జెట్‌ మూవీలో నటిస్తున్నారు. ఈ మూవీకి రాకా అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేయగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. బన్నీ లుక్‌ తోడేలును తలపించేలా ఉండడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింత పెరిగాయి. ఈ మూవీలో అల్లు అర్జున్‌ నెగెటివ్ రోల్ చేయనున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగానే బన్నీ మరో సినిమా ప్రకటించారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్‌ లోకేశ్‌ కనగరాజ్‌తో మూవీని(AA23) చేయనున్నట్లు వెల్లడించారు. అయితే తాజాగా వీరిద్దరి కాంబోలో వస్తోన్న చిత్రంపై రూమర్స్ వినిపిస్తున్నాయి. ఈ మూవీ ఆగిపోయిందని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది.

కానీ ఈ ప్రచారంలో ఎలాంటి నిజం లేదని టాలీవుడ్‌ ఇండస్ట్రీ వర్గాల సమాచారం. ప్రస్తుతం ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రీ-ప్రొడక్షన్ పనులు, కాస్టింగ్ ప్రాసెస్ శరవేగంగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. లోకేష్ కనగరాజ్‌కు అల్లు అర్జున్ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇక ఫైనల్ స్క్రిప్ట్‌ సిద్ధం చేసే పనిలో లోకేశ్ నిమగ్నమై ఉన్నారని ఇండస్ట్రీలో టాక్. ఈ మూవీని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనున్న సంగతి తెలిసిందే.  
 

Advertisement
 
Advertisement
Advertisement