ఆర్టీసీ ఉద్యోగిపై దాడి | - | Sakshi
Sakshi News home page

ఆర్టీసీ ఉద్యోగిపై దాడి

Jun 12 2024 1:08 AM | Updated on Jun 12 2024 1:38 PM

-

ఆర్టీసీ ఉద్యోగిపై దాడి చేస్తున్న వాహనదారులు

మంచిర్యాలఅర్బన్‌: మంచిర్యాల ఆర్టీసీ బస్టాండ్‌లో ఆన్‌డ్యూటీలో ఉన్న ఉద్యోగి(కంట్రోలర్‌)పై దాడి చేసిన ఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులు షాపింగ్‌ చేయడానికి వచ్చి ఇన్‌గేట్‌(అనుమతిలేని చోట) వద్ద కారు పార్కింగ్‌ చేసి వె ళ్తుండగా కంట్రోలర్‌ గమనించారు. కారును అక్కడ నుంచి తీసివేయాలని సూచించారు. 

దీంతో వారిద్ద రు ఉద్యోగి జమాల్‌పాషాపై పిడగుద్దులు గుద్దారు. స్థానికులు, ఆర్టీసీ సిబ్బంది జోక్యంతో గొడవ సద్దుమణిగింది. ఈ వీడియో సోషల్‌ మీడియాలో చక్క ర్లు కొడుతోంది. ఆర్టీసీ కంట్రోలర్‌ జమాల్‌పాషా దాడి విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నామని సీఐ బన్సీలాల్‌ తెలిపారు.

 

Advertisement
 
Advertisement
Advertisement