నిందితులకు శిక్షపడేలా చూడాలి | - | Sakshi
Sakshi News home page

నిందితులకు శిక్షపడేలా చూడాలి

Aug 2 2026 12:10 AM | Updated on Aug 2 2026 12:10 AM

● ఎస్సీ ఎస్టీ కోర్టు జడ్జి శశికుమార్‌

ఆదిలాబాద్‌టౌన్‌: దర్యాప్తు పకడ్బందీగా నిర్వహించి బాధితులకు న్యాయం చేసి నిందితులకు శిక్షపడేలా చూడాలని ఎస్సీ, ఎస్టీ కోర్టు జడ్జి బి.సి శశికుమార్‌ అన్నారు. జిల్లాకేంద్రంలోని కోర్టు ప్రాంగణంలో ఉ మ్మడి జిల్లా పరిధిలోని ఎస్సీ, ఎస్టీ కేసులకు సంబంధించిన దర్యాప్తు అధికారులతో శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ కేసుల్లో బాధితులకు సత్వర న్యాయం అందేలా చూడాలన్నారు. ఆలస్యం జరిగితే ప్రజలకు కోర్టులపై విశ్వాసం కోల్పోతారని తెలిపారు. ఫిర్యాదు అందిన వెంటనే నేరస్థలంలో సాక్ష్యాలు సేకరించి దర్యాప్తు చేపట్టాలన్నారు. నిర్దిష్ట సమయంలో చార్జిషీటు దాఖలు చేసి కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టి నేరం రుజువు చేయాలన్నారు. బాధితులకు న్యాయం చేసి వారికి రావల్సిన నష్టపరిహారం అందేలా చూడాలన్నారు. సమావేశంలో పీపీ ముస్కు రమణారెడ్డి, అదనపు ఎస్పీ సురేందర్‌రావు, ఉమ్మడి జిల్లా పరిధిలోని ఏసీపీ, డీఎస్పీలు ఎల్‌.జీవన్‌రెడ్డి, ప్రకాశ్‌, వెంకటేశ్వర్లు, కిరణ్‌కుమార్‌, అశోక్‌, లైజన్‌ అధికారులు రమేశ్‌, ఈశ్వర్‌సింగ్‌, రాఘవేందర్‌, ఉమాదేవి, గంగాసింగ్‌, పరశురాం, పండరి, రవీందర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement