మంచిర్యాలరూరల్(హాజీపూర్): హజీపూర్ మండలం గఢ్‌పూర్ శివారు ఎంసీసీ క్వారీ గుట్టల్లో కొలువై ఉన్న దుర్గాదేవి జాతర ఆదివారం నిర్వహించనున్నారు. ఉదయం ప్రత్యేక పూజలు అనంతరం దుర్గాదేవి దర్శనాలతోపాటు కుంకుమార్చనలు, తీర్థప్రసాద వితరణ ఉంటుందని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. జాతర కోసం తరలివచ్చే భక్తుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడుపుతుందని పేర్కొన్నారు. డీసీపీ భాస్కర్, ఏసీపీ ప్రకాశ్, సీఐ ప్రమోద్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాట్లు చేస్తున్నారు.
ప్రత్యేక ట్రాఫిక్ మార్గాలు..
మంచిర్యాలటౌన్: క్వారీ జాతరకు వెళ్లే భక్తులు ఇబ్బంది లేకుండా ప్రత్యేక రూట్ మ్యాప్ సిద్ధం చేసి, ట్రాఫిక్ మార్గాలను నిర్ణయించినట్లు మంచిర్యాల మేయర్ దర్ని మధుకర్ తెలిపారు. జిల్లా కేంద్రంలోని ఎంసీసీ నుంచి క్వారీకి వెళ్లేదారిలో రాళ్లవాగు బ్రిడ్జి వద్ద కోతకు గురైన అప్రోచ్ రోడ్డును సీఐ ప్రమోద్‌రావుతో కలిసి పరివీలించారు. మేయర్ మాట్లాడుతూ జాతరకు వెళ్లే భక్తులు డీసీపీ కార్యాలయం పక్క నుంచి కార్మెల్ స్కూల్, గ్రీన్‌సిటీ మీదుగా వెళ్లాలని, తిరిగివచ్చే వారు ఆండాళమ్మ కాలనీ, రంగంపేట మీదుగా పాతమంచిర్యాల నుంచి రావాలని సూచించారు. కార్పొరేటర్ కాకుల వరలక్ష్మి యువరాజ్, మంచిర్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ రామగిరి బానేష్, వైస్ చైర్మన్ జాలే రాయలింగు, మంచిర్యాల కార్పొరేషన్ కాంగ్రెస్ అధ్యక్షుడు తూముల నరేశ్, మాజీ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పూదరి తిరుపతి ఉన్నారు.


