మంచిర్యాలరూరల్(హాజీపూర్): ముల్కల్లలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశా ల, జూనియర్ కళాశాల విద్యార్థులు రాష్ట్రస్థా యి కిడ్స్, జూనియర్, సీనియర్ అథ్లెటిక్స్ క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. అథ్లెటిక్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మారయ్య ఆధ్వర్యంలో ఇటీవల మంచిర్యాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో నిర్వహించిన జిల్లాస్థాయి పోటీల్లో గురుకుల విద్యార్థులు అండర్–8 విభాగంలో గణేశ్, అండర్–10లో రిత్విక్, కార్తిక్, అండర్–12లో సాయిచరణ్, అండర్–16 విభాగంలో యశ్వంత్ ప్రతిభ కనబర్చా రు. ఈనెల 7, 8 తేదీల్లో హన్మకొండ జవహర్‌లాల్ నెహ్రూస్టేడియంలో జరిగే రాష్ట్రస్థాయి పో టీలకు అర్హత సాధించారు. ప్రిన్సిపాళ్లు, వైస్ ప్రిన్సిపాళ్లు, పీడీ, పీఈటీ వీరిని అభినందించారు.


