బెల్లంపల్లి: బెల్లంపల్లిలో మహాత్మా జ్యోతిబా పూలే బాలికల గురుకుల విద్యాలయంలో ఫుడ్ ఫాయిజన్ ఘటన ఇంకా మరువకముందే శనివారం మరో ఘటన చోటు చేసుకుంది. గురిజాలకు వెళ్లేదారిలో ప్రభుత్వ గిరిజన బా లుర ఆశ్రమ పాఠశాలలో చదువుతున్న ఏడుగురు విద్యార్థులు, ఏఎన్‌ఎం సైతం అస్వస్థత కు గురైన ఘటన కలకలం రేపింది. మధ్యా హ్న భోజనం చేసిన విద్యార్థులు కొద్దిసేపటి తర్వాత వాంతులు చేసుకుని కడుపునొప్పితో బాధపడగా ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లారు. కొద్దిసేపటికి ఏఎన్‌ఎం భవానీ చికిత్స తీసుకుని డిశ్చార్జీ కాగా విద్యార్థుఽలు చికిత్స పొందుతున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థుల్లో అకిరానందన్, రుషి , యశ్వంత్ ,నేశ్వంత్, విష్ణు, మణిచరణ్, విక్కీ ఉన్నారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు.


