బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఎంపీడీఓ మృతి | - | Sakshi
Sakshi News home page

బ్రెయిన్‌ స్ట్రోక్‌తో ఎంపీడీఓ మృతి

Jan 2 2024 12:56 AM | Updated on Jan 2 2024 11:00 AM

- - Sakshi

ఎంపీడీఓ జయసుధ(ఫైల్‌)

కల్వకుర్తి: చారకొండ మండల ఎంపీడీఓ జయసుధ(46) బ్రెయి న్‌ స్ట్రోక్‌కు గురికావడంతో నాలు గు రోజులుగా చికిత్స పొందుతూ.. మృతిచెందారు. డిసెంబర్‌ 28 రాత్రి బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో కుటుంబ సభ్యులు వెల్దండ సమీపంలోని యన్నమ్స్‌ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతిచెందినట్లు ఆస్పత్రి వైద్యులు తెలియజేశారు. వారి మృతదేహాన్ని కల్వకుర్తిలోని వారి స్వగృహానికి తరలించారు.

చారకొండ మండల ఎంపీడీఓగా ఆరేళ్లుగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఆమె భర్త ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. ఆమెకు కుమా ర్తె, కుమారుడు ఉన్నారు. ఆమె అకాల మరణంతో బంధువులు, స్నేహితులు మండలంలోని ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.

స్వగృహంలో వారి పార్థీవ దేహానికి అచ్చంపేట ఎమ్మెల్యే వంశీకృష్ణ, కల్వకుర్తి మున్సిపల్‌ చైర్మన్‌ సత్యం, మండలంలోని ఎంపీపీ, వైస్‌ఎంపీపీ, ఆయా శాఖల అధికారులు, నాయ కులు పార్థివ దేహానికి నివాళి అర్పించారు.

Advertisement
 
Advertisement
Advertisement