మహబూబ్‌ననగర్ న్యూటౌన్: జిల్లాలో అటవీశాఖ పరిధిలోని మూడు యూనిట్లకు నిర్వహించిన సీతాఫల్ టెండర్లతో రూ.27.46 లక్షల ఆదాయం వచ్చింది. డీఎఫ్‌ఓ రేవంత్‌చంద్ర ఆధ్వర్యంలో బుధవారం జిల్లా అటవీశాఖ అధికారి కార్యాలయం ప్రాంగణంలో 2026–27 సంవత్సరానికి సంబంధించి బహిరంగ వేలంపాట నిర్వహించారు. మహబూబ్‌నగర్, నవాబ్‌పేట, మహమ్మదాబాద్ యూనిట్లకు అటవీ ప్రాంతంలో సీతాఫలాల సేకరణ హక్కులు కల్పించేందుకు టెండర్లు నిర్వహించారు.మహబూబ్‌నగర్ యూనిట్‌కు నిర్వహించిన వేలం పాటలో పది మంది పాల్గొనగా.. తాటి శ్రీనివాసులు రూ.14 లక్షలకు దక్కించుకున్నారు. నవాబుపేట యూనిట్‌ను మక్సూద్ అలీ రూ.5.41 లక్షలకు, మహమ్మదాబాద్ యూనిట్‌ను జి.కేశవులు రూ.8.05 లక్షలకు దక్కించుకున్నారు. కార్యక్రమంలో మహబూబ్‌నగర్ అటవీ రేంజ్ అధికారి రాజేందర్, మహమ్మదాబాద్ రేంజ్ అధికారి అబ్దుల్‌హాయ్, పరిపాలనాధికారి పద్మజ తదితరులు పాల్గొన్నారు.


