స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల | - | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతే లక్ష్యంగా.. నిధుల విడుదల

Aug 13 2026 1:27 AM | Updated on Aug 13 2026 1:27 AM

నర్వ: గ్రామాల్లో స్వచ్ఛతకు పెద్దపీట వేస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను చేపట్టేందుకు ప్రభుత్వం నిధులు మంజూరు చేసింది. స్వచ్ఛభారత్‌ మిషన్‌ కింద ఉమ్మడి పాలమూరు జిల్లాలోని పలు ప్రాంతాలకు నిధులు కేటాయించారు. మహిళా సంఘాల భవనాలతో పాటు అంగన్‌వాడీ కేంద్రాలు, గ్రామ పంచాయతీ భవనాలు, మార్కెట్‌యార్డులు, దేవాలయాలు, ప్రజలు రద్దీగా ఉండే ప్రాంతాల్లో అవసరాన్ని బట్టి నిర్మాణాలు చేపట్టనున్నారు. అక్టోబర్‌ 2 నాటికి పనులు పూర్తి చేయాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. నిర్మాణాలకు అవసరమైన నిధుల్లో 70 శాతం స్వచ్ఛభారత్‌ మిషన్‌ నుంచి సమకూరనున్నాయి. మిగిలిన 30 శాతం నిధులను గ్రామ పంచాయతీలు, 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి వినియోగించనున్నారు. మహిళా సంఘాల భవనం వద్ద మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.1.25 లక్షలు, అంగన్‌వాడీ కేంద్రాల వద్ద రూ.52 వేలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాలు, గ్రామ పంచాయతీ భవనాల వద్ద సామూహిక మరుగుదొడ్ల నిర్మాణానికి రూ.3 లక్షల చొప్పున కేటాయించారు. సామూహిక ఇంకుడు గుంతల నిర్మాణానికి రూ.92,747 చొప్పున నిధులు అందించనున్నారు.

గతంలో జాప్యం.. ఇప్పుడు వేగం

గతంలో ఉపాధిహామీ, ఆర్‌డబ్ల్యూఎస్‌ ద్వారా నిర్మాణాలు చేపట్టినప్పుడు పనుల్లో జాప్యం, బిల్లుల చెల్లింపుల్లో సమస్యల కారణంగా పథకం ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ప్రస్తుతం స్వచ్ఛభారత్‌ మిషన్‌, మహిళా సమాఖ్య, డీఆర్‌డీఏ, పంచాయతీశాఖల సమన్వయంతో పనులను చేపడుతున్నారు. గ్రామాల్లో అవగాహన కల్పిస్తూ సామూహిక మరుగుదొడ్లు, మూత్రశాలలు, ఇంకుడు గుంతల నిర్మాణాలను వేగవంతం చేస్తున్నారు.

స్వచ్ఛభారత్‌ మిషన్‌ ద్వారా 70 శాతం నిధులు

ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రూ.21.91 కోట్లు మంజూరు

మహిళా సంఘాల భవనాలు, రద్దీ ప్రాంతాలు, దేవాలయాల వద్ద నిర్మాణాలు

అక్టోబర్‌ 2 లక్ష్యంగా పనులు ముమ్మరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement