బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి.. | - | Sakshi
Sakshi News home page

బతుకమ్మ ఆడుతూ మహిళ మృతి..

Jul 31 2023 1:16 AM | Updated on Jul 31 2023 7:45 AM

- - Sakshi

మహబూబ్‌నగర్‌: పీర్ల పండుగ వేడుకల్లో మహిళ బతుకమ్మ ఆడుతూ మృతి చెందిన ఘటన మండలంలోని చెన్నారంలో చోటు చేసుకుంది. గ్రామస్తుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన లత(35)కు బల్మూర్‌ మండలం కొండారెడ్డిపల్లికి చెందిన సైదులుతో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. పీర్ల పండుగ సందర్భంగా ఆమె తల్లిగారి ఇంటికి వచ్చింది.

శనివారం రాత్రి పీర్లచావిడి వద్ద మహిళలతో కలిసి బతుకమ్మ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలింది. వెంటనే కుటుంబసభ్యులు అచ్చంపేట ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లగా పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆమె భర్త ఊరైన కొండారెడ్డిపల్లికి తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు. ఆమెకు భర్త, కుమారుడు, కుమార్తె ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement