మావోయిస్టు లేఖల కలకలం | Sakshi
Sakshi News home page

మావోయిస్టు లేఖల కలకలం

Published Fri, Nov 17 2023 1:22 AM

- - Sakshi

మంచిర్యాలక్రైం: ఎన్నికల వేళ మావోయిస్టు లేఖలు కుమురంభీం జిల్లాలో కలకలం సృష్టిస్తున్నాయి. ఈ నెల 14న భారత కమ్యూనిస్టు పార్టీ(మావోయిస్టు) సింగరేణి కోల్‌బెల్డ్‌ కమిటీ కార్యదర్శి ప్రభాత్‌, 15న సిర్పూర్‌, చెన్నూర్‌ ఏరియా కార్యదర్శి మంగు పేరిట వేర్వేరుగా లేఖలు విడుదలయ్యాయి. బూటకపు అసెంబ్లీ ఎన్నికలను బహిష్కరించాలని, బీజేపీతోపాటు ఆ పార్టీకి మద్దతునిచ్చే బీఆర్‌ఎస్‌ను తరిమికొ ట్టాలని లేఖలో పేర్కొన్నారు. ఓపెన్‌కాస్టులు రద్దు చేయాలని, ఔట్‌సోర్సింగ్‌, క్యాజువల్‌ కార్మికులను పర్మినెంట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు.

సమస్యలు పరిష్కరించేంత వరకు నా యకులు ఓటు అడిగేందుకు ప్రజల గడప తొ క్కొద్దని హెచ్చరించారు. మంగు విడుదల చేసి న లేఖలో.. దశాబ్దాల క్రితం సిర్పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప ఆంధ్ర ప్రాంతం నుంచి వలస వచ్చారని పేర్కొన్నారు. కేసీఆర్‌తో చేతులు కలిపి దోపిడీదారులు చలామణి అవుతున్నారని ఆరోపించారు. కోనప్పను అవినీ తిపై నిలదీయాలని పిలుపునిచ్చారు.

అలాగే దివంగత పాల్వాయి పురుషోత్తంరావు కుమారుడు హరీశ్‌బాబు వారసత్వంతో రాజకీయాల్లోకి వచ్చాడని పేర్కొన్నారు. పురుషోత్తంరావు 1992లో ఆదివాసీ రైతు కూలీ సంఘం అధ్యక్షుడు నర్సన్నను అర్ధరాత్రి పోలీసులతో కాల్చి చంపించారని ఆరోపించారు. అలాగే కోనప్ప 2002లో సాంబన్న, అశోక్‌, మురళి, చిన్నన్నను బూటకపు ఎన్‌కౌంటర్‌ చేయించారని మండిపడ్డారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ తోడు దొంగలని, ఆ పార్టీ నాయకులను గ్రామాలకు రానివొద్దని పిలుపునిచ్చారు.

లేఖపై విచారణ చేపట్టాలి..
సిర్పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప

మావోయిస్టుల పేరిట ఇటీవల విడుదలైన బోగస్‌ లేఖపై సమగ్ర విచారణ చేపట్టి, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సిర్పూర్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే, బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కోనేరు కోనప్ప డిమాండ్‌ చేశారు. దీనిపై పోలీసు ఉన్నతాధికారులకు గురువారం ఫిర్యాదు చేసినట్లు ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టుల పేరిట లేఖ విడుదలపై బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు, సిర్పూర్‌ ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్‌ ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌తో పాటు ఆయన అనుచరులపైనే తమకు అనుమానం ఉందని పేర్కొన్నారు. కల్యాణ లక్ష్మి, షాదీముబారక్‌ లబ్ధిదారుల నుంచి రూ.82వేలు తీసుకున్నట్లు ఆ లేఖలో ఆరోపించగా, వాస్తవానికి రూ.82 కూడా తీసుకోలేదని స్పష్టం చేశారు.

డబ్బులు తీసుకున్నట్లు నిరూపిస్తే దేనికైనా సిద్ధమేనని పేర్కొన్నారు. గిరిజన బిడ్డల వద్ద డబ్బులు తీసుకోవాల్సిన కర్మ మాకు పట్టలేదన్నారు. ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌ కుమార్‌ పదవిలో ఉన్నప్పుడు మావోయిస్టులపై ఉక్కుపాదం మోపి అణచివేసిన విషయం అందరికి తెలుసన్నారు. అలాంటి వ్యక్తిపై ఈ లేఖలో ఎలాంటి ప్రస్తావన లేదన్నారు. ఆ లేఖలో రెండు పార్టీ నేతలకు మాత్రమే ఓటు వేయొద్దని పేర్కొనడం వెనుక ఆర్‌ఎస్పీతోపాటు ఆయన అనుచరుల హస్తం ఉందని ఆరోపించారు.

26 ఏళ్లపాటు పదవిలో ఉన్న వ్యక్తి తనకు ప్రాణహాని ఉందని పేర్కొనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఇలాంటి వ్యక్తి వాళ్ల మనుషులతోనే రాళ్లు వేయించుకుని ఎమ్మెల్యే కోనప్ప చేయించారని అనడానికి కూడా వెనుకాడరని ఎద్దేవా చేశారు. ఒక లారీ ఆయన కారును తగిలితే అది కూడా కోనప్ప తగిలించారని ప్రచారం చేసి దిగజారుడు రాజకీయాలకు పాల్పడే ప్రమాదం ఉందని పేర్కొన్నారు.

నిర్భయంగా ఓటుహక్కు వినియోగించుకోవాలి..
ప్రశాంత వా తావరణంలో ఎన్నికలు నిర్వహించేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉందని, ప్రజలు నిర్భయంగా ఓ టుహక్కు వినియోగించుకోవాలని ఎస్పీ సురేశ్‌కుమార్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లోని ఓటర్లు ఎలాంటి భయాందోళన కు గురికావొద్దని సూచించారు. ప్రజాస్వామ్యంలో ఆయుధం లాంటి ఓటును ఈ నెల 30న స్వేచ్ఛగా వినియోగించుకో వాలన్నారు. ఎన్నికల సందర్భంగా ఎ లాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సీఆర్‌పీఎఫ్‌ బలగాలను విని యోగిస్తున్నట్లు పేర్కొన్నారు. అభ్యర్థులు, ఓటర్లను భయభ్రాంతులకు గురిచేసేందుకు యత్నించే వ్యక్తులపై కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఎస్పీ సురేశ్‌కుమార్‌

Advertisement
Advertisement